వైకాపా కార్యాలయాల ప్రారంభం

బాల్కొండ: మండలంలోని నాగాపూర్‌, ఎల్కటూర్‌లలో ఈ రోజు వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాదిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి పర్యటించారు. రెండు గ్రామాల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రభుత్వం హయాంలో అభివృద్ది కుంటుపడిందని మళ్లీ వైఎస్‌ పాలన రావాలంటే వైకాపాను గెలిపించాలని ఆయన అన్నారు.