కనుల పండుగగా శివపార్వతుల కళ్యాణం

ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య ప్రత్యేక పూజలు
బచ్చన్నపేట ఫిబ్రవరి 16 ( జనం సాక్షి): జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు ( సిద్దుల గుట్ట ) గ్రామంలోని శ్రీ స్వయంబు సిద్దేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో హర హర మహాదేవ శంభో శంకర.. ఓం నమశ్శివాయ అంటూ భక్తుల శివనామస్మరణంతో మార్మోగింది ఆదివారం రాత్రి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఆలయ ప్రధాన అర్చకులు ఓం నమశ్శివాయ. ఈవో చిందం వంశీ . స్థానిక సర్పంచ్ నీల కవితా మురళి ఆధ్వర్యంలో కనుల పండుగ కళ్యాణం జరిగింది కళ్యాణముందు ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో నర్మెట సీఐ అబ్బయ్య. ఎస్సై హమీద్ ఆధ్వర్యంలో భద్రత ఏర్పాటుతోపాటు మెడికల్ క్యాంపు. పంచాయతీ సిబ్బంది. విద్యుత్ సిబ్బంది. భక్తులకు తగిన ఏర్పాట్లు భద్రతపై అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు . అర్చకులు సదాశివుడు. మహాశివుడు. సిబ్బంది లక్ష్మీకాంత్ రెడ్డి.శ్రీనివాస్. భాను ప్రకాష్ రెడ్డి . డైరెక్టర్లు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు



