ఏఐకి తెలంగాణే వేదిక: శ్రీధర్ బాబు
` ఏఐ యూనివర్సిటీ, ఏఐ హబ్‌ల ఏర్పాటుకు బడ్జెట్ కేటాయింపులు
` ఇంపాక్ట్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో శ్రీధర్ బాబు
న్యూఢిల్లీ(జనంసాక్షి):కత్రిమ మేథకు సంబంధించిన నూతన ఆవిష్కరణల వేదికగా నిలుస్తున్న తెలంగాణా రాష్ట్రం అమెరికా పెట్టుబడిదారులకు అనేక అవకాశాలను కల్పిస్తోందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రతిష్టాత్మక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్`2026‘ లో భాగంగా దేశ రాజధానిలో అమెరికా` ఇండియా వాజిజ్య మండలి ప్రతినిధులతో జరిగిన రౌండ్ టేబుల్ సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేసారు.ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అత్యున్నత టెక్నాలిజి ఎకోసిస్టం రాష్ట్రంలో నూతన అవకాశాలను సష్టించిందని శ్రీధర్ బాబు తెలిపారు. అమెరికా టెక్ దిగ్గజాలతో పబ్లిక్ ప్రేవేల్ భాగస్వామ్యాన్ని ఇప్పటికే తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. ముందు చూపుతో కూడిన స్థిరమైన విధానాలు ఏఐ పరిశోధనలకు ఆలంబనగా మారాయని శ్రీధర్ బాబు వివరించారు. ప్రజా సేవలపై రియల్ టైం పర్యవేక్షణతో కత్రిమ మేథ వినియోగాన్ని పెంచిన విషయాన్ని ఆయన వెల్లడించారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, పట్టణాభివద్ధి వంటి రంగాలపై దష్టి సారించిన ఇన్నోవేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను ంఎ రంగంలో అగ్రగామిగా నిలబెట్టింది.కత్రమ మేథ ఆవిష్కరణలకు ప్రపంచంలోనే ఒక ముఖ్య కేంద్రంగా నిలబడేలా తెలంగాణాను తీర్చుదిద్దు తున్నామని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రధర్ బాబు వెల్లడించారు. వేగంగా దూసుకుపోతున్న టెక్నాలజి ప్రపంచంతో పోటీ పడాలన్నదే తమ సంకల్పం అని ఆయన అన్నారు. ఏఐ యూనివర్సిటీ, ఏఐ హబ్ ల ఏర్పాటు, ప్రతిభావంతులతో కూడిన స్కిల్ ఫోర్స్ ను అందుబాటులోకి తెచ్చేందుకు త్వరలో ప్రవేశ పెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ లో అత్యంత ప్రాధాన్యతనిస్తాం అని వెల్లడించారు.


