వైజ్ఞానిక ప్రదర్శనలు వాయిదా
ఖమ్మం, నవంబర్ 10 : జిల్లాస్థాయిలో ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించాల్సిన వైజ్ఞానిక ప్రదర్శనలు వాయిదా వేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి వెంకట్రెడ్డి తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు, ఇతర ఉపాధ్యాయులు ఈ మార్పును గమనించాలని కోరారు. ప్రదర్శనలు ముందుగా ప్రకటించిన వేదిక పాలేరులోని జవహర్ మహోదయ విద్యాలయంలో ఈ నెల 22, 23, 24 తేదీల్లో జరుగుతాయని, ఈ మార్పును గమనించాలని కోరారు.