వైద్యులకు ఎర్రబెల్లి ప్రదీప్ రావు అభినందనలు
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 29(జనం సాక్షి)
గోదావరిఖని కి చెందిన వడ్డెపల్లి స్వప్న అనే బాధితురాలికి సుమారు 20 రోజులు సరైన వైద్య పరీక్షలు నిర్వహించి, సమస్యను గుర్తించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకొని సుమారు మూడు గంటలు శ్రమించి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులకు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అని బిజెపి నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు అదేవిధంగా
బాధితురాలి కుటుంబసభ్యుల ఆనందానికి అవదులు లేకపోవడం చూస్తుంటే మనస్సుకు సంతోషంగా ఉందన్నారు
కేంద్ర ప్రభుత్వ ముందు చూపుతోనే వరంగల్ కు మెరుగైన సూపర్ స్పెషాలిటీ సేవలు
తెలంగాణలో హైదరాబాద్ తరువాత మొదటిసారిగా ఓపెన్ హార్ట్ సర్జరీ మన వరంగల్ లోని కాకతీయ ప్రధానమంత్రి స్వస్థ్ సంరక్షణ యోజన పథకం ద్వారా నిర్మాణం చేపట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ విజయవంతంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు
ఇప్పటికైనా కే.ఎం.సీ. లోని సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ కి రాష్ట్ర వాటాను పూర్తిగా చెల్లించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రదీప్ రావు కోరారు