శత్రుదాడులకు భయపడం

` అత్యాధునిక ఆయుధాలతో దాడులు చేస్తాం జాగ్రత్త :ఇరాన్
` అమెరికా,ఇజ్రాయెల్ లక్ష్యంగా విరుచుకుపడుతున్న ఐఆర్‌జీసీ
` జోర్డాన్, యూఏఈలోని రాడార్ కేంద్రాలు ధ్వంసం
` మా టార్గెట్ అమెరికా స్థావరాలే.. దాడుల్లో ఎవరూ చనిపోలేదు: ఇరాన్ మంత్రి
` ఇజ్రాయిల్ డిమోనా అణు కేంద్రంపై దాడికి ఇరాన్ గురి
` ఇరాన్ డ్రోన్ క్యారియర్ షిప్ ధ్వంసం.. మంటల్లో భారీ యుద్ధనౌక
` ఇరాన్ ప్రతీకార దాడుల వేళ.. దుబాయ్ వాసులకు అలర్ట్
` శంషాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు 12 విమానాలు రద్దు చేసిన భారత్
టెహ్రాన్(జనంసాక్షి):తమ నౌకలు లక్ష్యంగా జరుగుతోన్న దాడులపై ఇరాన్ రగిలిపోతోంది. అమెరికా త్వరలోనే ఘోరంగా చింతించాల్సి వస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జోర్డాన్, యూఏఈలోని రాడార్ కేంద్రాలను ఇరాన్ ధ్వంసం చేసింది. ఉపగ్రహ చిత్రాల విశ్లేషణలో ఈ విషయం వెల్లడైంది. ఇక, ఇప్పటికే ఖతార్‌లోను అత్యంత శక్తిమంతమైన రాడార్ కేంద్రాన్ని ధ్వంసం చేసింది.ఇక
పశ్చిమాసియాలో బాంబుల మోత మోగుతోంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఇరాన్ నేవీ లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ డ్రోన్ వాహక నౌకపై దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ‘ఎక్స’ వేదికగా వెల్లడించింది. ఆ దశ్యాలను షేర్ చేసింది. “ఇరాన్ నేవీ మొత్తాన్ని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో ముందుకువెళ్తున్నాం. తాజాగా ఇరాన్ డ్రోన్ వాహక నౌకను టార్గెట్ చేయడంతో అది మంటల్లో చిక్కుకుంది” అని పేర్కొంది. ఫిబ్రవరి 28న ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్`అమెరికా దాడులు ప్రారంభించాయి. దాంతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఇటీవల హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధనౌక ఐరిస్ దేనా`75ను యూఎస్ ముంచేసింది. ఇప్పుడు మళ్లీ డ్రోన్ వాహక నౌకను ధ్వంసం చేసింది. ఇప్పటివరకు ఇరాన్‌కు చెందిన 30 యుద్ధ నౌకలను ముంచేశామని/ధ్వంసం చేశామని సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అలాగే ఆ దేశంలోని 200 లక్ష్యాలపై బాంబర్ ఫోర్స్ దాడి చేసినట్లు వెల్లడించింది. బి`2 స్పిరిట్ బాంబర్లు భూగర్భ లక్ష్యాలపై బంకర్ బస్టర్లను జారవిడిచినట్లు పేర్కొంది.
ఇరాన్ ప్రతిదాడులు..
మా టార్గెట్ అమెరికా స్థావరాలే.. దాడుల్లో ఎవరూ చనిపోలేదు: ఇరాన్ మంత్రి
పశ్చిమాసియాలోని అమెరికా ఆస్తులపై మాత్రమే తాము దాడులు చేస్తున్నామని ఇరాన్ విదేశాంగ సహాయ మంత్రి సయ్యద్ ఖతీబ్జాదే వెల్లడించారు. తమ దాడుల వల్ల పొరుగున ఉన్న అరబ్ దేశాల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదన్నారు. దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో తన దేశం చేపడుతున్న చర్యలను ఆయన సమర్థించారు.“యూఎస్ ఆస్తులనే మేం లక్ష్యంగా చేసుకుంటున్నాం. అందుకే మా దాడుల వల్ల అరబ్ దేశాల్లో ప్రాణనష్టం సంభవించలేదు” అని ఖతీబ్జాదే అన్నారు. అలాగే ఇటీవల హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధనౌక ఐరిస్ దేనా`75ను యూఎస్ ముంచేసిన సంగతి తెలిసిందే. “భారత స్నేహితుల ఆహ్వానం మేరకు ఆ నౌక ఇక్కడికి వచ్చింది. దానిపై అమెరికా దాడి దురదష్టకరం” అని వ్యాఖ్యానించారు. అలాగే దిల్లీ పర్యటనలో భాగంగా ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో భేటీ అయ్యారు.ఇజ్రాయెల్`అమెరికా దాడుల్లో ఖమేనీ సహా పాలనావర్గానికి చెందిన పలువురు ఉన్నతస్థాయి వ్యక్తులు చనిపోయారు. వారి మతితో ఇరాన్ రాజకీయ వ్యవస్థ కూలిపోతుందని ట్రంప్ ప్రభుత్వం వ్యాఖ్యలు చేస్తోంది. వాటిని ఖతీబ్జాదే తోసిపుచ్చారు. తమ దేశ పాలనా నిర్మాణం వ్యక్తులపై కాకుండా వ్యవస్థలపై ఆధారపడి ఉందని స్పష్టంచేశారు. “ఇరాన్‌లో రాజ్యాంగం ఉంది. ఎవరెవరు ఏఏ బాధ్యతలు నిర్వహించాలనే దానిపై స్పష్టమైన విభజన ఉంది” అని అన్నారు.
ఇజ్రాయిల్ డిమోనా అణు కేంద్రంపై దాడికి ఇరాన్ గురి
ఇజ్రాయిల్ దాడులకు ప్రతిదాడులను ముమ్మరం చేసిన ఇరాన్ ఇజ్రాయెల్ అణు రియాక్టర్‌పై గురిపెట్టిందన్న వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయిల్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేస్తామని ప్రకటించింది. ఇజ్రాయెల్ తన అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను డిమోనాకు రక్షణగా మోహరించింది. ప్రపంచంలోనే అత్యంత దుర్భేద్యమైన ప్రదేశంగా మార్చేసింది. ఇక్కడ యారో`2, 3, డేవిడ్ స్లింగ్ వంటి క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఇటీవల తన అత్యాధునిక ఐరన్ బీమ్‌ను కూడా ఇక్కడికే తరలించినట్లు కథనాలు వెలువడ్డాయి. అంతేకాదు.. భూగర్భంలో కొన్ని అంతస్తుల కింద తన అణు కార్యక్రమాన్ని ఇజ్రాయెల్ సురక్షితంగా ఉంచినట్లు తెలుస్తోంది. డిమోనాపై దాడి చేయడానికి ఇరాన్ అమ్ములపొదిలో డ్రోన్లు, క్షిపణులు వంటి చాలారకాల ఆయుధాలు ఉన్నాయి. రియాక్టర్ నుంచి ఇరాన్ 1200`1500 కిలోవిÖటర్ల దూరంలో ఉంది. ఇంత దూరం ప్రయాణించేందుకు టెహ్రాన్ అమ్ముల పొదిలో షహిన్ 136 డ్రోన్లు భారీ సంఖ్యలో ఉన్నాయి. ఇది దాదాపు 50 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. ఇక క్షిపణుల విషయానికి వస్తే సాహబ్`3, ఖైబర్‌షేకన్, ఎమాద్, ఖుర్రంషహర్, ఘద్ర, సెజ్జిల్, సుమర్ వంటి క్షిపణులున్నాయి. వీటి రేంజి 1300 కిలోవిÖటర్ల నుంచి 2500 కిలోవిÖటర్ల వరకు ఉంది. ఇవికాకుండా ఫతా`2 హైపర్ సోనిక్ క్షిపణి కూడా ఉంది. ఇది ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలను కూడా తప్పించుకోగలదు. గతంలో సిరియాతో ఘర్షణ వేళ ఈ రియాక్టర్ సవిÖపంలో కొన్ని క్షిపణులు పడ్డాయి. ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత పొరుగు దేశాలు వరుసగా దానితో యుద్దాలకు దిగాయి. అమెరికా సాయంతో.. వాటిని ఓడించినా.. ఎప్పటికైనా తన ఉనికికి ముప్ప్పు తప్పదని గ్రహించింది. దీంతో నాటి ప్రధాని డేవిడ్ బెన్ గురియన్ తమ దేశాన్ని అణుశక్తిగా మార్చాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రాన్స్ సాయంతో అణు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు నెగెవ్ ఎడారిలో ’డిమోనా’ అనే ప్రదేశంలో ఓ భారీ రియాక్టర్‌ను ఇజ్రాయెల్ నిర్మించింది. ఐరోపా దేశాల టెక్నాలజీ, బ్లూప్రింట్స్, నిపుణుల సాయంతో దీనిని రూపొందించారు. ఇందులోని భూగర్భ బంకర్లలో అణుబాంబులకు వాడే ప్లుటోనియం ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఈ విషయం అతికొద్దిమందికి మాత్రమే తెలుసు. అలా ఇజ్రాయెల్ అణ్వాయుధం తయారీలో డిమోనా రియాక్టర్ కీలక పాత్ర పోషించింది. ఈ రియాక్టర్‌కు ఉత్తరం వైపు 85 కిలోవిÖటర్ల దూరంలో జెరూసలెం నగరం ఉంది. ఇక 75 కిలోవిÖటర్ల దూరంలో ఈజిప్ట్ సరిహద్దులు.. 25 కిలోవిÖటర్ల దూరంలో జోర్డాన్ ఉన్నాయి. ఒకవేళ దాడి జరిగితే ఇక్కడి నుంచి లీకయ్యే రేడియేషన్ ప్రభావం ఈ దేశాలకు కూడా పాకే ప్రమాదం ఉంది.
ఇరాన్ ప్రతీకార దాడుల వేళ.. దుబాయ్ వాసులకు అలర్ట్
అమెరికా`ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. అయితే, ఇరాన్ నుంచి వచ్చే క్షిపణులు, డ్రోన్లను ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నామని యూఏఈ రక్షణశాఖ పేర్కొంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని తెలిపింది. ఇదే సమయంలో దుబాయ్ నగరం కూడా స్థానిక పౌరులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. శుక్రవారం కూడా క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందని కొందరికి మొబైల్ అలర్ట్‌లు వస్తున్నట్లు సమాచారం.అయితే, అలర్ట్ అందుకున్న వెంటనే కొందరు ఇళ్ల నుంచి బయటకు వెళ్లి లేదా వాహనాలు నిలిపి ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నట్లు తమ దష్టికి వచ్చిందని యూఏఈ విపత్తు నిర్వహణ విభాగం పేర్కొంది. ఇలాంటివాటికి దూరంగా ఉండాలని.. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించింది. ముందుజాగ్రత్త చర్యగా కిటికీలకు దూరంగా ఉండాలని తెలిపింది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై ఎప్పటికప్పుడు సోషల్ విÖడియా వేదికగా స్థానిక పౌరులకు జాగ్రత్తలు చెబుతోంది.
శంషాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు 12 విమానాలు రద్దు చేసిన భారత్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో విమానాల రద్దు కొనసాగుతోంది. శంషాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన 12 విమానాలు రద్దయ్యాయి. అదే సమయంలో గల్ఫ్ దేశాల నుంచి శంషాబాద్‌కు రావాల్సిన మరో 12 విమానాలు కూడా రద్దయ్యాయి. ఖతార్, యూఏఈ, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా నుంచి రావాల్సిన, వెళ్లాల్సిన విమానాలు రద్దు అయినట్లు అధికారులు తెలిపారు.

 

ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే
` ఆ దేశంతో ఇక ఎటువంటి ఒప్పందం ఉండదు
` ఆ తర్వాత ఆమోదయోగ్యమైన నాయకుడి ఎన్నిక ఉంటుంది
` ఆ తర్వాత క్యూబా సంగతి చూస్తాం: ట్రంప్
` యుద్దం నుంచి వెనక్కి తగ్గబోం
` అసలు యుద్ధం ఇప్ప్పుడే మొదలైంది:అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెథ్
వాషింగ్టన్(జనంసాక్షి):ఇరాన్‌తో ఎటువంటి ఒప్పందం ఉండదని, బేషరతుగా లొంగిపోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఆ తర్వాత ఇరాన్‌కు ఆమోదయోగ్యమైన నాయకుడి ఎన్నిక ఉంటుందన్నారు. వివిధ భాగస్వామ్య పక్షాలతో కలిసి ఇరాన్‌ను సంక్షోభం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు తాము కషి చేస్తామన్నారు. గతంలో లేని విధంగా ఇరాన్‌ను ఆర్థికంగా మెరుగైన, బలమైన స్థితికి తీసుకువస్తామన్నారు. ఇరాన్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొంటూ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ పోస్టు చేశారు.
ముందు ఇరాన్ పని ముగించి.. క్యూబా సంగతి చూస్తాం: ట్రంప్
క్యూబా లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి తీవ్రమైన ముప్పుగా మారిందని పేర్కొన్నారు. ముందు ఇరాన్ పని ముగించి.. తర్వాత క్యూబా సంగతి చూస్తామన్నారు. అయితే అది ఎప్పుడో తెలియదన్నారు. ఇజ్రాయెల్ దళాలతో కలిసి, అనుకున్న దానికంటే వేగంగానే తమ దళాలు ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తున్నాయన్నారు. వరుస దాడుల వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యాలు కూడా భారీగా క్షీణించాయన్నారు. ఈ దాడులను ఎదుర్కోవడానికి వారికి తమలా వైమానిక దళం లేదని పేర్కొన్నారు.ఇరాన్ నావికాదళాన్ని కూడా తాము పూర్తిగా నాశనం చేశామని ట్రంప్ ప్రకటించారు. మూడు రోజుల్లోనే 24 ఇరాన్ నౌకలను తుడిచిపెట్టామన్నారు. దీంతో ఆ దేశ అధికారులు తమ కాళ్ల బేరానికి వచ్చారన్నారు. అణు ఒప్పందంపై చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్లు పలువురు ఇరాన్ అధికారులు తమకు చెప్పారని.. అయితే, ఇప్పటికే ఆలస్యమైందని తాను చెప్పినట్టు పేర్కొన్నారు. టెహ్రాన్ రాజకీయ భవిష్యత్తును పునర్నిర్మించడంలో ఇరాన్ దౌత్యవేత్తలు తమకు సహకరించాలన్నారు. మరోవైపు తమతో ఒప్పందం చేసుకోవడానికి క్యూబా సైతం ఎదురుచూస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో తమ ఆపరేషన్ ముగిసిన తర్వాత అమెరికా విదేశాంగ విధాన ప్రాధాన్యాల్లో పలు మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. ఇదీ చదవండి: సుంకాల సొమ్ము వాపసు చేయాల్సిందే
ఖమేనీ హత్యకు నవంబర్‌లోనే ప్రణాళిక
అమెరికా` ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోవడం సంచలనం సష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ కీలక విషయాలు బయటపెట్టారు. సుప్రీం నేత అడ్డు తొలగించాలని తాము గతేడాది నవంబర్‌లోనే నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఓ విÖడియాతో మాట్లాడుతూ.. గతేడాది చివర్లో ఓ ఉన్నతస్థాయి భద్రతా సమావేశం జరిగిందని కట్జ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతత్వంలో జరిగిన ఆ సమావేశంలో ఖమేనీ అడ్డు తొలగించాలని గట్టిగా నిర్ణయించుకొన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇరాన్‌పై కొనసాగుతున్న ఆపరేషన్.. 2026 మధ్యలో జరగాల్సి ఉందన్నారు. అప్పట్లో ఈ ప్రణాళిక గురించి అమెరికాకు వెల్లడించలేదన్నారు. ఇటీవల ఇరాన్ పాలనను వ్యతిరేకిస్తూ ఆ దేశంలో నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నెతన్యాహుల మధ్య దీని గురించి చర్చ జరిగినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఇరుదేశాలు సంయుక్తంగా ముందుగానే ఆపరేషన్ మొదలుపెట్టినట్లు వెల్లడించారు. ఆపరేషన్ తొలిరోజే ఖమేనీ కార్యాలయం లక్ష్యంగా అమెరికా` ఇజ్రాయెల్ భీకర దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఖమేనీతో సహా ఆయన కుటుంబంలోని పలువురు ప్రాణాలు కోల్పోయారు. టెహ్రాన్‌లోని ట్రాఫిక్ కెమెరాలు, ఫోన్ నెట్‌వర్క్‌ను ట్రాక్ చేసి ఖమేనీ కదలికలపై నిఘా పెట్టి.. అత్యంత కచ్చితత్వంతో ఈ దాడి చేసినట్లు విÖడియా కథనాలు వెల్లడించాయి. ఖమేనీ మతికి ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులు చేస్తోంది. దీంతో ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు రణరంగాన్ని తలపిస్తున్నాయి.
యుద్దం నుంచి వెనక్కి తగ్గబోం: అమెరికా రక్షణ మంత్రి
వాషింగ్టన్,మార్చి6(ఆరఎనఎ): ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం నుంచి వెనక్కి తగ్గేదే లేదని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెథ్ స్పష్టం చేశారు. అమెరికా సైనిక శక్తిని ఇరాన్ తక్కువ అంచనా వేస్తోందన్నారు. ఈ యుద్ధంలో అమెరికా నిలబడలేదని ఇరాన్ అనుకుంటోందని, తాము అసలు పోరాటాన్ని ఇప్ప్పుడే మొదలుపెట్టామని ఆయన పేర్కొన్నారు. ఇక గల్ఫ్ ప్రాంత సముద్ర జలాల్లో అమెరికా నౌకా దళాలు వెనక్కి జరుగుతున్నాయనే ప్రచారాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఖండించింది. యావత్ ఇరాన్ నేవీని సముద్రంలో ముంచేసే వరకు తమ మిషన్ ఆగదని తేల్చి చెప్పింది. గత 72 గంటల్లో ఇరాన్‌లోని దాదాపు 200 లక్ష్యాలపై అమెరికా బాంబర్ ఫోర్స్ వైమానిక దాడులు చేసిందని సెంట్‌కామ్ వెల్లడించింది. బి`2 స్పిరిట్ బాంబర్ విమానాల నుంచి కేవలం ఒక గంట వ్యవధిలోనే 2వేల పౌండ్ల బరువున్న డజన్ల కొద్దీ పెనెట్రేటర్ బాంబులను బాలిస్టిక్ మిస్సైల్ లాంచ్ ప్యాడ్లపై వేశామని పేర్కొంది. అమెరికా సంకల్పం ఎంత బలమైందో ఇరాన్ అర్థం చేసుకోలేకపోతోందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెథ్ అన్నారు. ఇరాన్‌పై తమ సైనిక చర్యను బలంగా కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. వాషింగ్టన్‌లో విలేకరుల సమావేశం వేదికగా పీట్ హెగ్సెథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాను ఇరాన్ నేతలు, ఐఆర్‌జీసీ తక్కువ అంచనా వేస్తున్నాయని ఆయన చెప్పారు. తమ సంకల్పానికి కట్టుబడి ఉంటామని, ఇరాన్‌పై పోరాటాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. పూర్తి శక్తితో అమెరికా ఇప్ప్పుడే దాడులను మొదలుపెట్టిందన్నారు. ఒకవేళ అవసరమైతే దీర్ఘకాలం పాటు ఈ యుద్దాన్ని చేసేందుకూ అమెరికా సన్నద్ధమై ఉందని పేర్కొన్నారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో అరబ్ దేశాల నుంచి అమెరికాకు శరణార్ధులు క్యూ కట్టే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే అరబ్ శరణార్ధులకు అమెరికాలో ఆశ్రయాన్ని కల్పించే ఎలాంటి ప్రణాళికలూ ప్రస్తుతానికి తమకు లేవని అమెరికా రక్షణ మంత్రి తేల్చి చెప్పారు.

 

ఇరానియన్లు ప్రాణత్యాగాలకూ సిద్ధమయ్యారు
` కానీ అమెరికన్లు అందుకు రెడీగా లేరు
` యుద్ధం త్వరగా ముగుస్తుందని అమెరికా భావించింది
` కానీ అమెరికా అంచనాలకు భిన్నంగా ఇరాన్ వ్యూహాలు
` మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా మిత్రదేశాలపైనా దాడులు
` మాజీ రా చీఫ్ విక్రమ్ సూద్ కీలక వ్యాఖ్యలు
` చివరి బుల్లెట్, చివరి సైనికుడి దాకా పోరాడుతాం
` ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి సయీద్ ఖాతిబ్‌జాదే
న్యూఢిల్లీ(జనంసాక్షి):ఇరాన్, అమెరికా ` ఇజ్రాయెల్ సైనిక సంఘర్షణపై భారతదేశ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) మాజీ చీఫ్ విక్రమ్ సూద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో అవసరమైతే చనిపోయేందుకు ఇరానియన్లు సిద్ధంగా ఉన్నారని, కానీ అమెరికన్లు ప్రాణత్యాగాలకు సిద్ధంగా లేరన్నారు. శుక్రవారం ఏఎనఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్స్ చేశారు. చనిపోయేందుకు సిద్ధపడే ఇరానియన్లు అమెరికాతో పోరాడుతున్నారని విక్రమ్ సూద్ పేర్కొన్నారు. ఈ యుద్ధం నిర్దిష్టంగా ఎంతకాలం పాటు కొనసాగుతుందో ఇప్పుడే చెప్పడం కష్టమన్నారు.కానీ అమెరికా ఊహించిన దాని కంటే ఎక్కువ కాలంపాటు ఈ యుద్ధం కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. ఈ యుద్ధం త్వరగా ముగియాలని, ఇరాన్‌పై భీకర దాడులు చేసి వెళ్లిపోవాలని అమెరికా భావించిందని ఆయన తెలిపారు. కానీ అమెరికా అంచనాలకు పూర్తిగా భిన్నమైన ఆటను ఇరానియన్లు ఆడుతున్నారన్నారు. మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా మిత్రదేశాలపైనా ఇరాన్ దాడులు చేస్తున్న విషయాన్ని విక్రమ్ సూద్ గుర్తుచేశారు. మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా సైనిక స్థావరాలను పెద్దముప్పుగా ఇరాన్ పరిగణిస్తోందన్నారు.
చివరి బుల్లెట్, చివరి సైనికుడి దాకా పోరాడుతాం : ఇరాన్
భారత్‌లోని దిల్లీలో జరుగుతున్న రైసినా డైలాగ్ 11వ సదస్సుకు ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి సయీద్ ఖాతిబ్‌జాదే హాజరయ్యారు. శుక్రవారం ఉదయం ఆయన భారత వార్తాసంస్థలతో మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. దేశ రక్షణ కోసం వీరత్వంతో పోరాడటం తప్ప తమకు ఇప్పుడు మరో మార్గం లేదని తేల్చి చెప్పారు. చివరి బుల్లెట్, చివరి సైనికుడి దాకా అమెరికా, ఇజ్రాయెల్‌ల దండయాత్రపై పోరాడుతామని ఖాతిబ్‌జాదే స్పష్టం చేశారు.ప్రస్తుతం అమెరికన్లు, ఇజ్రాయెలీలు ఇరాన్‌పై దాడి, దండయాత్ర చేస్తున్నారని, తమ దేశానికి వీలైనంత భారీ నష్టాన్ని కలిగించేందుకు యత్నిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ దాడి, దండయాత్రను బలంగా ప్రతిఘటించడానికే తాము ప్రాధాన్యత ఇస్తామన్నారు. కార్పెట్ బాంబింగ్ ద్వారా ఇరాన్ ప్రజలను అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆయన తెలిపారు. ప్రతిఘటించడం తప్ప ఇరాన్‌కు ఇంకో మార్గం లేదన్నారు.