పదవ తరగతి ఫలితాల్లో జిల్లా మొదటి స్థానం లో గౌడబిడ్డ కొరంకున్నత్ (రొయ్యల)కృష్ణ

ఏటూరు నాగారం మే 03 జనం సాక్షి):  మండల కేంద్రంలోని (రొయ్యల) కోరం కున్నత్ రంజిత్ కుమార్ గౌడ్ సంధ్య, దంపతుల కుమార్తె కృష్ణగౌడ్, పదవ తరగతి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని 600 మార్పుల గాను 589 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో మొదటి స్థానం లో టాపర్ గా నిలవడం జరిగింది. ఈ సందర్భంగా కల్లుగీత కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో ఆదివారం రోజున రేణుక ఎల్లమ్మ గుడి ఆలయ చైర్మన్ గడ్డం రాజమొగిలి గౌడ్, అధ్యక్ష తన రొయ్యల కృష్ణ కు, ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా గడ్డం రాజమొగిలి గౌడ్, కల్లు గీత సోసైటీ అధ్యక్షులు సప్పిడి రాము గౌడ్, ఉపాధ్యక్షులు మేరుగు రఘు గౌడ్, సంఘం మండల నాయకులు తాళ్లపేల్లి నరేందర్ గౌడ్ లు, మాట్లాడుతూ పట్టుదలతో చదివి జిల్లా టాపర్ గా నిలిచి ఏటూరునాగారం పేరు నిలబెట్టడం చాలా అభినందనీయమని అన్నారు.చదువుకు పేదరిక అడ్డు కాదని కృష్ణ , నిరూపించిందని అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో ఉన్నత స్థాయి చదువులు చదువు కొని సమాజంలో మంచి గుర్తింపు పొందాలని వారన్నారు. ఈ సందర్భంగా కృష్ణ ,తో పాటు వారి తల్లిదండ్రులు రంజిత్ కుమార్, సంధ్య లను, కూడా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్బంగా విద్యార్థి కృష్ణ మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం చేయడం చాలా సంతోషం అని అన్నారు. ఎల్లపుడు కృష్ణ పై చదువు లకు కళ్ళుగీత కార్మిక సంఘం అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సప్పిడి రామ్ నరసయ్యగౌడ్, మొడెం వెంకటస్వామి గౌడ్, బోనగాని సదానందం గౌడ్, గడ్డం మహేష్ గౌడ్, గడ్డం వినయ్ గౌడ్, మెరుగు వెంకటేశం గౌడ్, గడ్డం ప్రసాద్ గౌడ్, గడ్డం బిక్షపతి గౌడ్, తాళ్లపెల్లి వెంకటస్వామి గౌడ్, తోపాటు 30 మంది కల్లు గీత కార్మికులు పాల్గొన్నారు.