మంత్రి శ్రీధర్ బాబు అభివృద్ధి మార్క్..!

పెద్ద పేట మంథని, ( జనంసాక్షి) : రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అభివృద్ధి మార్క్..! చూపిస్తూ వస్తున్నారు. సిఆర్ఆర్ ఎస్సి కాంపోనెంట్ క్రింద మరో రూ. 15 కోట్ల నిధులు మంజూరు చేయించి .. గ్రామాలలో సిసి రోడ్ల నిర్మాణం, డ్రైన్ల అభివృద్దికి పెద్ద పేట వేశారు. పెద్దపల్లి, భూపాల్ పల్లి రెండు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న మంథని నియోజకవర్గంలోని 10 మండలాల్లో సిఆర్ఆర్ ఎస్సి కాంపోనెంట్ క్రింద సిసి రోడ్ల నిర్మాణం, డ్రైన్ల అభివృద్ది పనులకు గాను రూ.15 కోట్ల నిధులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మంజూరు చేయించారు. ఈ మేరకు మంథనిలోని మంత్రి కార్యాలయం నుంచి మంత్రి పిఏ ఆకుల చంద్రశేఖర్ ప్రకటన విడుదల చేశారు. మంథని మండలంలో 34 గ్రామాలకు రూ. 330 లక్షలు, ముత్తారం మండలంలో 15 గ్రామాలకు 155 లక్షలు, రామగిరి మండలంలో 17 గ్రామాలకు 135 లక్షలు, కమాన్ పూర్ మండలంలో 8 గ్రామాలకు 60 లక్షలు, మంథని నియోజక వర్గం పరిధిలోని పాలకుర్తి మండలంలోని నాలుగు గ్రామాలకు 20 లక్షలు, కాటారం మండలంలో 24 గ్రామాలకు 250 లక్షలు, మహ ముత్తారం మండలంలో 24 గ్రామాలకు 175 లక్షలు, మహాదేవ్ పూర్ మండలంలో 18 గ్రామాలకు 145 లక్షలు, మల్హార్ మండలంలో 15 గ్రామాలకు 160 లక్షలు, పలిమెల మండలంలో 8 గ్రామాలకు 70 లక్షల నిధులను మంత్రి శ్రీధర్ బాబు మంజూరు చేయించారు. మంథని నియోజకవర్గం పరిధిలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్ పూర్, పాలకుర్తి మరియు కాటారం, మహాముత్తారం, మహదేవ్ పూర్, మల్హర్ రావు, పలిమెల మండలాలకు సిఆర్ఆర్ ఎస్సి కాంపోనెంట్ క్రింద 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కి 10 మండల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, గ్రామపంచాయతీ సర్పంచ్ లు, పాలకవర్గం సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.



