రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం రైతులు దళారులను నమ్మి మోసపోకండి
బొంరాస్ పేట, మే 3(జనం సాక్షి): రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని,రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే వడ్లు అమ్ముకొని మద్దతు ధర పొందాలని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేష్ రెడ్డి,ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నర్సింలు గౌడ్ అన్నారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రైతులు వడ్లు ఆరబెట్టుకొని ప్రభుత్వం నిర్దేశించిన తేమ శాతం కలిగి ఉండేలా చూసుకోవాలన్నారు.ప్రభుత్వం రూ.2,389, ఏ గ్రేడ్ వరి ధాన్యానికి, రూ.2,369 బి గ్రేడ్ వరి ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తుందన్నారు. రైతులు ప్రభుత్వము ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ జయకృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ మల్లేశం, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్, మెట్ల కుంట సర్పంచ్ ఉమాదేవి,మాజీ ఎంపీటీసీ నరసింహనాయుడు,మాజీ సర్పంచులు మహేందర్, మహిపాల్,మెట్లకుంట గ్రామ వార్డు సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.



