శివలింగం తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
జహీరాబాద్ ఆగస్టు 28 (జనంసాక్షి) మండల పరిధిలోని కొత్తూరు బి గ్రామంలో గల మధు నగర్ శివాలయంలో శివలింగాన్ని తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్పీ బజరంగ్దళ్ బిజెపి పలు హిందూ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు ఆదివారం ఉదయం మధు నగర్ ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ కాలనీ శివాలయంలోని శివలింగాన్ని పరిశ్రమ యాజమాన్యం ప్రోత్బలం తోటే తొలగించారని ఆరోపించారు ఈ సందర్భంగా ఆలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు అనంతరం జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో విగ్రహము తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పట్టణ సిఐ భూపతికి ఫిర్యాదును అందజేశారు. ఈ కార్యక్రమంలోహిందూ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.