శ్రీ అభ్యాస్ మోడల్ హై స్కూల్ లో ముందస్తు బతుకమ్మ వేడుకలు,
ఆట పాటలతో అలరించిన విద్యార్థులు,
ఖానాపురం సెప్టెంబర్ 24జనం సాక్షి
ఒక్కేసీ పువ్వేసి చందమామ… జాము రాతిరాయే చందమామ… చిత్తు, చిత్తుల బొమ్మ.. శివుని ముద్దలగుమ్మా అంటూ నర్సంపేట పట్టణంలోని శ్రీ అభ్యాస్ మోడల్ హై స్కూల్ లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.పాఠశాలలకు సోమవారం నుంచి దసరా సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ముందస్తు బతుకమ్మ వేడుకలు సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు ధరించిన విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో కనువిందు చేశారు. పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణంలో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు, ఉపాధ్యాయునిరాల బృందంకోలాటాలు, నృత్యాలతో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగల విశిష్టత గురించి తెలియజేస్తున్నాము అన్నారు.