శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగ భక్తులకు దుర్గమ్మా దర్శనం
రేగోడ్/ జనంసాక్షి సెప్టెంబర్ :
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం స్థానికతుల్జాభవాని దేవాలయంలో అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా దేవాలయ పూజారి శివకుమార్ భక్తులనుద్దేశించి మాట్లాడుతూ బాలదేవి మహిమాన్వితమైన తల్లి అని, శ్రీ బాలమంత్రం సమస్త మంత్రాలలో గొప్పదన్నారు. శ్రీవిద్యా ఉపాసకులు మొట్టమొదట బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారని తెలిపారు.పవిత్రమైన శ్రీచక్రంలో ఉండే మొదటి దేవత బాలాదేవి అని చెప్పారు.తొమ్మిది రోజుల పాటు జరిగే అలంకరణలలో భక్తులకు పూర్ణ ఫలం అందించే అలంకారణా చేశారు శ్రీ బాలాదేవిని భక్తులు దర్శనం చేసుకున్నారు. రేగోడ్ లోని పోచమ్మ దేవాలయం, దుర్గమ్మా దేవాలయల్లో ప్రతేక పూజలు,కాగా మక్త గ్రామంలో ఏర్పాటు చేసిన అమ్మ వారుకు భవాని దీక్ష భక్తులు డీలర్ హమ్మతు, మ్మెల్యేశం,శ్రీ దుర్గ వాహిని భక్త బృందం ఆధ్వర్యంలో ప్రతేక పూజలు చేశారు.