సంగర్తి కవిత కుటుంబానికి గ్రేటర్ అట్లాంటా సహాయం
లక్ష రూపాయల బాండ్ అందించిన పన్నెల జనార్దన్
ఖానాపూర్ రూరల్ 25 సెప్టెంబర్(జనం సాక్షి): గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ పన్నెల జనార్దన్ ఇటీవల మరణించిన సంగర్తి కవిత కూతురు సహన పెరు మీద రూపాయలు లక్ష బాండ్ ను వారి కూతురుకు స్థానిక ఎమ్మెల్యే రేఖ నాయక్ చేతులమీదుగా ఆదివారం అందించారు.ఉదరత చాటుకున్న పన్నెల జనార్ధన్ ను ప్రముఖులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు వేల్పుల అశోక్,పరం కుశం శ్రీనివాస్,కౌసులర్ జన్నారపు శంకర్,నాయకులు గొర్రె గంగధర్, కొక్కుల ప్రదీప్,కౌట మహేష్,శోభన్,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.