సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 30 : జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతామని సిపిఐ జిల్లా కార్యదర్శి కె.శంకర్‌ పేర్కొన్నారు. జిల్లాలో పార్టీని పటిష్టం చేయడంతో పాటు స్థానిక సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని పార్టీ సమావేశంలో తీర్మానించామని ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పాటు విషయమై పార్టీ ఆధ్వర్యంలో నవంబర్‌ 23న మహాసభను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలసుకొని వారి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పార్టీతో పాటు అనుబంధ సంఘాలైన ఎఐఎస్‌ఎఫ్‌, ఎఐవైఎఫ్‌లకు త్వరలో కమిటీలను వేస్తామని ఆయన తెలిపారు.