సమైక్యవాదం ఏ రూపంలో విచినా తెలంగాణ బిడ్డలు తిప్పికొడతరు

ఆంధ్రాలో జగన్‌ పార్టీగ గెలిస్తే ..
తెలంగాణ ఏర్పాటవుతుందన్న సీమాంధ్ర నేతలు మాటకు కట్టు బడాలె
అసెంబ్లీలో తెలంగాణ తీర్మాణం చేయాలె
కోదండరాం
సమైక్యవాదం ఏ రూపంలో వచ్చినా దాన్ని తెలంగాణ బిడ్డలు తిప్పికొడ్తరని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. సమైక్యవాదం ఏ రూపంలో తెలంగాణ ప్రజలు తిప్పికొడతారని, పరకాల ఉప ఎన్నికలో ఓటర్లు ఇచ్చిన తీర్పే ఇందుకు నిదర్శనమన్నారు. సీమాంధ్రలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సారధ్యంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అవుతుందని ప్రచారం చేసుకున్న సమైక్యవాద పార్టీల నాయకులు ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా బిల్లు ఆమోదించాలని ఆయన డిమాండ్‌ చేశారు. టీ జేఏసీ పిలుపు మేరకు పరకాలలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భిక్షపతిని గెలిపించిన ఓటర్లకు, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కోదండరాం కృతజ్ఞతలు తెలిపారు.