*సరిహద్దు గ్రామాల్లో హై అలర్ట్*
*గ్రామలను జల్లెడ పడుతున్న ఎస్సై అరుణ్*
*పలిమెల, సెప్టెంబర్ 27 (జనంసాక్షి)* జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం రాష్ట్ర సరిహద్దు మరియు గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో మావోయిస్టులు సంచరించే అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రతి గ్రామాన్ని, వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పలిమెల పోలీసులు. పలిమెల ఎస్సై అరుణ్ ఆధ్వర్యంలో మంగళవారం లెంకల గడ్డ గ్రామ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనపత్రాలు, వ్యక్తిగత పత్రాలు చెక్ చేసి పంపించారు. అభివృద్ధి విరోధకుల కోసం ఎలాంటి సహాయం చేయకూడదని వాహన యజమానులకు సూచించారు. అనంతరం గ్రామాల్లో డాగ్ స్క్వాడ్ తో సైతం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కొత్త వ్యక్తులను నమ్మకూడదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వాహన దారులు సరైన పత్రాలతో వాహనాలు నడపాలని తెలిపారు. సరైన పత్రాలు లేని వారికి జరిమానా విధించారు. ఈ తనిఖీలలో ఎస్సై అరుణ్ తో పాటు సివిల్ మరియు సీఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.