సర్కార్‌ను తలకిందులు చేద్దాం

సెప్టెంబర్‌మార్చ్‌ను విజయవంతం చేద్దాం
ప్రచారానికి కదులుండ్రి
రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు
‘మార్చ్‌’ లో పాల్గొంటాయి
కోదండరామ్‌ పిలుపు
హైదరాబాద్‌, జూలై 30 (జనంసాక్షి) : తెలంగాణ రాక పోతే ప్రభుత్వాన్ని తలకిందులు చేస్తామని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మెన్‌ కోదండరాం హెచ్చరించారు. సెప్టెంబరు 30న జరిగే తెలం గాణ మార్చ్‌ను విజయవంతం చేస్తామన్నారు.  తెలంగాణ మార్చ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పాల్గొంటాయని తెలిపారు. నిన్నటి వరకు ఉద్యోగులను ఏకం చేసిన స్వామిగౌడ్‌ ఇక తెలంగాణవాదులను ఏకం చేయాలని కోరారు. తెలంగాణ మార్చ్‌ కోసం ప్రచారం వెంటనే ప్రారంభించాలని పిలుపు ఇచ్చారు. తెలంగాణ మార్చ్‌ తెలంగాణ వ్యతిరేకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఉండాలన్నారు. ఈసారి ఉద్యోగుల సమ్మె వ్యూహాత్మకంగా ఉంటుందన్నారు.