శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వెళ్లాల్సిన 18 విమానాలు ర‌ద్దు

 

 

 

 

“అక్టోబర్ 28 (జనం సాక్షి )హైద‌రాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వెళ్లాల్సిన 18 విమానాలు ర‌ద్దు అయ్యాయి. శంషాబాద్ నుంచి విజ‌య‌వాడ‌, విశాఖ‌, రాజ‌మండ్రికి వెళ్లాల్సిన విమానాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. విజ‌య‌వాడ‌, విశాఖ‌, రాజ‌మండ్రి నుంచి శంషాబాద్‌కు రావాల్సిన విమానాలు కూడా ర‌ద్దు అయ్యాయి.

మొంథా తుపాను కార‌ణంగా విమాన స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో విమానాల‌ను ర‌ద్దు చేశారు. ఈ క్ర‌మంలో ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొంథా తుపాను కార‌ణంగా ఏపీలోని ప‌లు జిల్లాల్లో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. ప‌రిస్థితి అల్ల‌క‌ల్లోలంగా ఉంది. అక్క‌డ‌క్క‌డ భారీ వృక్షాలు నేల‌కూలాయి. ప‌లు రోడ్లు ధ్వంసం అయ్యాయి.