సార్ నమస్కారములు.సోషల్ మీడియా మీద రాసిన ఈ కవిత పరిశీలించ ప్రార్థన.
సామాజిక మాధ్యమం
అదొక ప్రభంజనం,
జగమంతా విస్తరించిన
మాయాజాలం.
విజ్ఞాన విధ్వంస సమ్మిళితం,
దుర్మార్గాన్ని ప్రేరేపించే పిశాచం.
ఆకర్షిస్తుంది ఆయస్కాంతమై,
అలరిస్తుంది కల్పతరువై.
దూరపోళ్ళను దగ్గర చేస్తూ,
దగ్గరోళ్లను దూరం చేసే
మానవసంబంధాలను మాయచేసే
మంత్ర దండమిది.
పరిచయం అవసరంలేని
ఈ ప్రపంచంలో
ఫలించని స్వప్నాలకోసం
దీర్ఘమౌనాల్ని బద్దలు కొడుతూ
గళమెత్తే గొంతులెన్నో.
సర్వజన సమ్మోహిని,
సమస్త కార్యవాహిని,
సకల కళాకారిణి అయిన
రెండంచుల ఈ పదును కత్తిని వాడొచ్చు
వినాశనానికైనా, లోకాకళ్యాణానికైనా!
ఆ ప్రవాహంలో కొట్టుకుపోకపోతే
ప్రతి మనిషి పరిమళించే పువ్వే.
అభివృద్ధికి ఆసరా అయిన
ఈ ప్రసార మాధ్యమంతో
అంబరాన్ని చుంబిస్తావో,
అధఃపాతాళానికి పోతావో
నిర్ణయం నీదే ఓ మనిషీ!
వేమూరి శ్రీనివాస్
9912128967
తాడేపల్లిగూడెం
హామీపత్రం
“మోహిని” అను ఈ కవిత పూర్తిగా నా స్వంతం.దేనికీ అనువాదం,అనుకరణ కాదు.ఎక్కడా ప్రచురింపబడలేదు. సోషల్ మీడియాలో పెట్టియుండలేదు.ఈ కవితకి సంబంధించిన పూర్తి బాధ్యత నాదే.
వేమూరి శ్రీనివాస్, 9912128967, తాడేపల్లిగూడెం