సింహద్రి ఎన్టీపీసీలో కార్మికుని మృతి. అందోళన
పరవాడ సింహద్రి జాతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం ఎన్టీపీసీ నాలుగో యూనిట్ విస్తరణ పనుల్లో బుధవారం ఉదయం ప్రమాదం సంబవించింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంకు చెందిన కార్మికుడు 24 మీటర్ల ఎత్తునుంచి వెల్డింగ్ పనులు చేస్తూ కిందపడి మృతిచెందాడు. తోటి కార్మికులు మృతదేహన్ని బయటకు తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహరం చెల్లించకుండా బయటకు తీసుకెళ్లనివ్వమని వారు అందోళన చెందారు.