సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.

పాలాభిషేకం చేస్తున్న టిజిబికెఎస్ నాయకులు.
బెల్లంపల్లి, సెప్టెంబర్29,(జనంసాక్షి)
సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని టీబీజీకేఎస్ గని ఫిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్ అన్నారు. సింగరేణి కార్మికులకు లాభాల వాటా ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ శాంతిఖని గని ఆవరణలో టిజిబికెఎస్ ఆధ్వర్యంలో గురువారం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బొగ్గు గని
కార్మికులకు దేశంలోనే అత్యధికంగా దసరా కానుక అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని గుర్తు చేశారు. కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో పలు పథకాలను అమలు చేస్తున్నారని వెల్లడించారు. 120 మెడికల్ బోర్డులు ఏర్పాటు చేసి సింగరేణి వ్యాప్తంగా 12,500 మందికి యువరక్తాన్ని నింపారని తెలిపారు. లాభాల్లో వాటాను ప్రకటించి కేసీఆర్ మరోసారి కార్మికులపై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారని
పేర్కొన్నారు. గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, అధ్యక్షుడు వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్యకు
కార్మికుల తరపున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మందమర్రి ఏరియా కార్యదర్శి వెంకటరమణ, నాయకులు రాజనాల రమేష్,
చిలుక రాజనర్సు, శ్రీనివాసచారి, కొట్టె రమేష్ తదితరులు పాల్గొన్నారు.