సెల్‌షాపుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

కరీంనగర్‌:(టౌన్‌)సెల్‌షాపుల సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు హబీబ్‌ ఆధ్వర్యంలో మానేరు హోటల్‌ కాంప్లేక్స్‌ ముందు జెండా ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా భబీబ్‌ మాట్లాడుతూ రంజాన్‌ మాసంలో స్వతంత్య్ర దినోత్సవం రావటం చాలా ఆనందంగా ఉందని, దేశం మనకోసం స్వతంత్య్రం ఇచ్చిందని ప్రతి పౌరుడు దేశంకోసం సమగ్రతా భావంతో శాస్త్రసాంకేతిక రంగాల్లో భాగస్వామ్యం కావాలని కంప్యూటర్ల యుగంలో అనాధిగా వస్తున్న మన సాంప్రదాయాలను పాటిస్తూ సనీతన మార్గంలో అన్వేహించాలని మత సామరస్యానికి భారతదేశం చిహ్నం అని అభివర్ణించారు. శాంతి, సౌభాగ్యం, సమగ్రతకు మూడు సింహాలా చిహ్నమని దేశంలోని అన్ని మతాలకు చిహ్న మందిరాలు, ధర్గాలు మినార్‌లు, చర్చిలు, జాతి, మత,  భేదాలు లేకుండా కాపాడుతున్నాయని ఆయన అన్నారు. నగర ఉపాధ్యక్షులు నూక మహేష్‌, జనరల్‌ సుక్రెటరీ ఎండి.అస్మత్‌అలి, మధు.రాజ్‌గణేష్‌, రత్నలాడ్జ్‌ ఎండి రామరావు వేడుకల్లో పాల్గొన్నారు.