హరితహారంపై నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు

—కలెక్టర్ సిక్తా పట్నాయక్

గుడిహత్నూర్: ఆగస్టు 25 జనం సాక్షి)ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమ అమలులో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను హెచ్చరించారు గురువారం మండలంలోని గుడిహత్నూర్ నుంచి టాకీగూడ వరకు మల్టీరేయర్ పద్దతిలో నాటిన మొక్కలను అమె పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మాన్కపూర్ నుండి టాకీగుడ వరకు మొక్కలు నాటకుండా ఖాళీగా కనిపించడంతో మొక్కలు ఎందుకు పెట్టలేదని అధికారులను ప్రశ్నించారు రెండు రోజులో పూర్తి స్థాయిలో మొక్కలు నాటలన్నారు మొక్కల పెంపకం వాటి నిర్వహణ విషయంలో అంకితభావంతో విధులు నిర్వహించాలన్నారు ఎక్కడైనా నిర్లక్ష్యానికి ఆస్కారం కల్పిస్తే ఎంపీడీవోలు, ఏపీవోలను కూడా సస్పెండ్‌ చేసేందుకు వెనకాడమన్నారు. ఇప్పటికే అనేక పర్యయాలు సూచనలు చేయడం జరిగిందని ఇకనుంచి ఎలాంటి నోటీసులు, మెమోలు ఇవ్వకుండానే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అవెన్యూ ప్లాంటేషన్‌, ఇనిస్టూషనల్‌ ప్లాంటేషన్‌ వందకు వందశాతం పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు మండలంలో హరితహారం నిర్వహణలో అనేక లోపాలు ఉన్నాయని వేంటేనే వాటిని సరైన ప్రణాళికతో సరిదిద్దాలని రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో మొక్కలు నాటాలని ఎంపిడిఓ సునీతకు ఆదేశించారు. కాగా కలెక్టర్ పర్యటనలో మండల అధికారులు సమయానికి రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారుఆమె వెంట డిఆర్డీఏ పీడీ కిషన్ ,అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్,ఎంపీడీఓ సునీత, ఎంపిఓ లింగయ్య ఏపీ ఓ సుభాషిణి, పంచాయతీ కార్యదర్శులు రాందాస్, లావణ్య తదితరులు ఉన్నారు