హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎన్ఎస్ యుఐ కృషి చేస్తుందని ఆ సంఘ సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు రాజబోయిన శ్రీకాంత్ అన్నారు.ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూర్ వెంకట్  ఆదేశాల మేరకు జిల్లా  అధ్యక్షులు కందుకూరి అంబేడ్కర్  ఆధ్వర్యంలో అసెంబ్లీ అధ్యక్షుడు బంధం విష్ణు నాని సూచన మేరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్టల్స్ ను సందర్శించారు.ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థుల సమస్యలు , ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులకు అందించే భోజనం, పడక గదులను పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులకు దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి పోరాడుతామని విద్యార్థులకు హామీ ఇచ్ఛారు.ఈ కార్యక్రమంలో నాయకులు  పవన్, నగేష్ , జాఫర్, సందీప్, కార్తీక్ , భారత్ , శ్రీమాన్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు