హోంగార్డుల జీతభత్యాల పెంపు

రాజమండ్రి :హోంగార్డులకు జీతభత్యాలు పెంచుతున్నట్లు డీజీపీ దినేశ్‌రెడ్డి తెలిపారు. అంతేకాకుండా వారికి ఆరోగ్య శ్రీ, బస్సు సౌకర్యం కూడా కల్పించనున్నట్లు వెల్లడించారు. పోలీస్‌ సిబ్బంది ఎంపిక ప్రక్రియలో 5 కి.మీ. పరుగు పందాన్ని 800 మీటర్లకు తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.