అంగన్వాడీ కేంద్రాలలో పోషణ మేళా
పోషణ మెాళ మసొత్సవాల కార్యక్రమాలు
•వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరం
¶ఐ సి డి ఎస్ సూపర్వైజర్ మమత
మహా ముత్తారం సెప్టెంబర్ 22( జనం సాక్షి) ఈ నెల 1 నుంచి 30 వరకు జరిగే పోషణ మహోత్సవాలలో భాగంగా ప్రతి ఒక అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు జరపడం జరుగుతుందని మండల్ ఐసిడిఎస్ సూపర్వైజర్ మమత అన్నారు. గురువారం మండలంలోని ప్రేమ్ నగర్, ఆంజనేయ పల్లి, సింగారం అంగన్వాడీ కేంద్రాలలో పోషణ మెాళ కార్యక్రమాలు సూపర్వైజర్ మమత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచులు కుర్ర వినోద, మొక్క రాజేశ్వరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తల్లులకు వెయ్యి రోజుల ప్రాముఖ్యత పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలపై న్యూట్రిషన్ వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. బంజారా సాంప్రదాయ వంటకలైన బెల్లంతో తయారుచేసిన అన్నం, బెల్లంతో రొట్టెలు, ముద్దలు, బెల్లం తో పాయసం, జొన్న రొట్టెలు, శనిగలు, పెసర్లు తదితర పదార్థాలు తయారు చేసి ప్రదర్శించి తల్లులకు పిల్లలకు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐసిడిఎస్ సూపర్వైజర్ మమత మాట్లాడుతూ గర్భవతులు చిన్నారుల తల్లులు వ్యక్తిగత పరిశుభ్రతను ఖచ్చితంగా ఉండాలని పిల్లలు కూడా ఉంచాలని తెలిపారు. ఎంత ఎక్కువ గా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించినట్లయితే మన దగ్గరికి రోగాలు దరిచేరవని అన్నారు. మొలకెత్తిన విత్తనాలు ఈ సీజన్లో లభించే వాటిని తినాలని పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం అందుతుందన్నారు. ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు వంటి పదార్థాలు గర్భిణీలు పిల్లలు తీసుకోవాలని వాటి వలన కలిగే లాభాలను మీకే తెలుస్తుందని ఉన్నారు. క్రమం తప్పకుండా చిన్నపిల్లలను మీ గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల వద్దకు తల్లిదండ్రులు పంపించేందుకు కృషిచేయాలని అన్నారు. అంగన్ వాడి కే�