అందమైన గూడు అల్లుతున్న గిజిగాడి పక్షి.

పక్షులు జాతుల ను కాపాడుకోవాలని రైతుల ఆవేదన

ఎల్లారెడ్డి 18 సెప్టెంబర్ (జనంసాక్షి) వర్షాకాలం వచ్చిందంటే చాలు పక్షులు గుళ్ళు కట్టునే పనిలో వుంటాయి మానవ మేధస్సు కు అందని విధంగా అద్భుతమైన అల్లికలతో ప్రమాదాలు రాకుండా కట్టుకునే పక్షులలో గిజిగాడు అని పిలుచుకునే ఒక పక్షి నీ చూడని వారుండరు అంటే నమ్మరేమో ఇప్పుడు రేడియేషన్ తో కొన్ని రకాల పక్షులు . ఎక్కడికి వెళ్ళయో తెలియదు ఒకప్పుడు తెల్లారితే చాలు పక్షుల కీలకిలl రావాలతో ఇళ్ళు. పంట పొలాలు. చెట్లు గుట్టలు పక్షుల చప్పుళ్లతో వినిపించేవి ఆ చప్పుళ్ళు ఇప్పుడు కానరావడం లేదు. దీనితో పర్యావరణ పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. ఎక్కడో ఒక చోట అరుదుగా పక్షులు కనబడుతున్నాయి. పక్షి సంపద పెంపొందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్షా కాలం ప్రారంభం అయిందంటే గ్రామీణ ప్రాంతాల్లోపచ్చటి ప్రకృతి చెట్ల చిటారు కొమ్మల్లో గిజుగాడి (పిచ్చుక) గూళ్ళు రమణీయంగా కనిపిస్తాయి. చిన్న పక్షి అయితేనేమి తనను తన సంతతిని కాపాడుకొనేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది ఈ పక్షి తెలివైన పక్షి. తనను, తన సంతతిని శత్రువుల బారి నుంచి రక్షించుకునేందుకు, కొత్త కొత్త ఉపాయాలతో జీవించడం కూడా ప్రకృతి నేర్పించిన పాఠమే. గిజిగాడు మారుమూల ప్రాంతాల్లో జక్కుల పిట్టగా గుర్తింపు పొందింది. కుంటలు. చెరువులు , కాలువల ఇత చెట్లు కు గుళ్ళు నిర్మించుకుని జీవిస్తాయి సమీపంలో.. వ్యవసాయ బావులు, వాగు ఒడ్లపై, కాలువలు, నీటి ప్రదేశాల్లో చెట్ల చిటారు కొమ్మలను ఆధారం చేసుకొని ఒకొక్క గడ్డి లాంటి నార పొసలను, ఈత కొమ్మల నారను నోటితో చీల్చి మరి గూడు అల్లుతుంది. ఇంజనీర్ లకు సైతం అర్థం కాని రీతిలో దృడంగా, ఆకర్షణీయంగా ప్రత్యేక ఆకృతిలో అందంగా గూడును తయారు చేసుకుంటుంది. ఈ గూళ్లను ఎక్కువగా ఈత, తాటి, రేగు, తుమ్మ చెట్లపై కట్టుకుంటుది. ఎంత వర్షం వచ్చినా, సుడిగాలి వీచిన గూడు చెదరకుండా, తడువకుండా బలంగా నిర్మించుకుంటుంది. తాను పొదిగే గుడ్లను, తన సంతతిని భుజించే శత్రువులు అయిన విష సర్పాలు, గద్ద జాతికి చెందిన పక్షుల బారి నుంచి రక్షణ పొందేందుకు ఈ నిర్మాణం ఒక కారణమైతే హంస తూలిక పాన్పుపై సేద దీరుతూ పిల్ల గాలి సయ్యాటలకు వాగు పరవళ్లును అందుకునే రీతిలో ఊగుతూ అనుభూతిని పొందే దృశ్యాన్ని ఆవిష్కరించడం మరో కోణం. ఈ గిజిగాడు గుడు పక్షులను రక్షించుకోవాలి ప్రభుత్వం పక్షి సంతతి నాషించకుండ చూడాలి అని రైతులు కోరుతున్నారు