అంబరాన్నంటిన ముగింపు సంబురాలు
సర్వంగా సుందరంగా సాగర తీరం
పాల్గొన్న గవర్నర్ దంపతులు, సీఎం కేసీఆర్
హైదరాబాద్: జూన్ 07(జనంసాక్షి):
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్న ఈ వేడుకలను వీక్షించేందుకు నగరవాసులు భారీగా తరలివచ్చారు. పీపుల్స్‌ప్లాజా నుంచి ట్యాంక్‌బండ్ వరకు చేపట్టిన ర్యాలీలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ఉట్టిపడేలా కళాకారులు ప్రదర్శనలు, నృత్యాలు చేశారు. వేడుకల సందర్భంగా ట్యాంక్‌బండ్ పరిసరాల్లో బాణాసంచా వెలుగులు, లేజర్ షో కనువిందు చేశాయి. వివిధ రంగుల్లో వెలుగులు విరజిమ్ముతూ వీక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి.వేడుకలకు తరలివచ్చిన ప్రజలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం లక్ష లడ్డూలను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ లడ్డూల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేదిక మీద ఉన్న అతిథౖలందరికీ ఆయనే స్వయంగా లడ్డూలు పంపిణీ చేశారు.
‘ముగింపు వేడుకల్లో’ సీఎం, గవర్నర్ దంపతులు
ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్న ఈ వేడుకలను వీక్షించేందుకు నగరవాసులు భారీగా తరలివచ్చారు. ఈ వేడులకు గవర్నర్ నరసింహన్ దంపతులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. కొన్ని దశాబ్దాల సుదీర్ఘ పోరాటం అనంతరం సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ముగింపు వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఆదివారం పీపుల్ ప్లాజా నుంచి ట్యాంక్ బండ్ వరకూ నిర్వహించిన భారీ ర్యాలీ ఆకట్టుకుంది. దాదాపు లక్ష మంది ప్రజలతో చేపట్టిన ర్యాలీ కన్నుల పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో , గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు.తెలంగాణ సాంస్కృతిక, కళా వైభవాన్ని చాటేలా వివిధ కళా రూపాలను ట్యాంక్‌బండ్‌పై ప్రదర్శిస్తున్నారు. ధూంధాం, ఆట, పాటలు, బతుకమ్మలు, బోనాలతో ట్యాంక్‌బండ్‌పై సందడి నెలకొంది.
తెలంగాణ ఆవిర్భావ ముగింపు వేడుకలకు హాజరైన సానియామీర్జా
తెలంగాణ రాష్ట్ర అంబాసిడర్, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా ట్యాంక్‌బండ్ వద్ద జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ ముగింపు వేడుకలకు హాజరయ్యారు. ఈ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిచేలా సాగుతున్న ఈ వేడుకలను తిలకించేందుకు నగరం నలుమూలల నుంచి ప్రజలు భారీుౖత్తున తరలివచ్చారు.