అంబేడ్కర్‌ మహత్తర శక్తి

5

– బాబా సాహెబ్‌ స్వగ్రామంలో గ్రామ్‌ ఉదయ్‌సే భారత్‌ ప్రారంభించిన మోదీ

భోపాల్‌,ఏప్రిల్‌ 14(జనంసాక్షి): అంబేద్కర్‌ మ¬న్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని ప్రధాని మోడీ

అని కొనియాడారు. అంబేద్కర్‌ స్వేచ్చా, సమానత్వం, సాంఘీక న్యాయం కోసం పోరాడిన మహనీయుడన్న విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 125వ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈమేరకు  మధ్యప్రదేశ్‌లోని అంబేద్కర్‌ స్వగ్రామం మౌలో నిర్వహించిన వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అంబేద్కర్‌ స్మారకాన్ని సందర్శించారు. గ్రామ్‌ ఉదయ్‌ సే, భారత్‌ ఉదయ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ.. అంబేద్కర్‌ స్వగ్రామంలో ఆయన జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అంబేద్కర్‌ మ¬న్నత వ్యక్తి అని కొనియాడారు. అంబేద్కర్‌ స్వేచ్చా, సమానత్వం, సాంఘీక న్యాయం కోసం పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్థికాభివృద్ధి పట్టణాలకే పరిమితం కావొద్దన్నారు. అంబేడ్కర్‌ స్వగ్రామాన్ని సందర్శించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయంపై అంబేడ్కర్‌ ఆనాడే పోరాడారని కొనియాడారు. సమానత్వం, గౌరవం కోసం ఆయన అలుపెరుగని పోరాటం చేశారన్నారు. గ్రామాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని… ఈసారి బడ్జెట్‌లో గ్రామాలు, రైతులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు మోదీ తెలిపారు. గ్రామాల అభివృద్దికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని మోడీ అన్నారు. పేదల కోసం జన్‌ధన్‌ యోజన, గ్యాస్‌ం పంపిణీ, ప్రమాద భీమా తదితర కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్‌ సిఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌కు రాష్ట్రపతి, ప్రధాని నివాళి

డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆయనకు జాతి ఘనంగా నివాళి అర్పించింది. దేశవ్యాప్తంగా ఆయనకు నేలు నివాళి అర్పించారు. పార్లమెంట్‌ ఆవరణలో డా. భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ 125వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించిన ప్రధాని నరేంద్రమోదీ అంబేద్కర్‌ జై భీమ్‌, విశ్వ మానవ్‌ అంటూ ట్వీట్‌ చేశారు. కాగా అంబేద్కర్‌ జన్మస్థలం మధ్యప్రదేశ్‌లోని మహూలో ప్రధాని పర్యటించనున్నారు.

భారత రాజ్యాంగాన్ని రచించిన డా. బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వమానవుడని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు ట్విట్టర్‌ ద్వారా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. పేద, అట్టడుగు వర్గాల ప్రజలకు సేవ చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ సందర్భంగా మోదీ ఓ ఫొటోను పోస్టు చేశారు. ంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని ‘గ్రామ్‌ ఉదయ్‌ సే భారత్‌ ఉదయ్‌’ అభియాన్‌ కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. మధ్యప్రదేశ్‌లోని మో ప్రాంతం నుంచి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు.