అంబేద్కర్‌ విగ్రహాల ధ్వంసం-క్షీరాభిషేకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల అంబేద్కర్‌ విగ్రహాల విధ్వంసాలు, చెప్పుల దండలు వేయడాలు,వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్నాయి. వీటిపై విభిన్న వాధనలు,కారణాలు ఉన్నా అందుకు కావలసింది క్షీరాభిషేకాలు చేయడం, పాత విగ్రహాల ప్రదేశంలో కాంస్య విగ్రహాలు ప్రతిష్టించడం కాదు. దళితులు మరింత ఐక్యతతో సంఘటితపడి, అంబేద్కర్‌ ఆలోచనలనూ, భావాలనూ, నేటి భారత దేశ పరిస్థితులకు అన్వయించుకొని, సాంఘిక, ఆర్థిక అసమా నతలకు వ్యతిరేకంగా, భూస్వామ్య, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడడం. పోరాటం చేస్తున్న వివిధ మార్క్సిస్ట్‌-లెనినిస్ట్‌-మావోయిస్టు ఉద్యమాలతోమమేకమై, విప్లవ పోరాటల ద్వారానే ఈ దేశంలో కుల వ్యవస్థను నిర్మూలించగలమనే ఆత్మవిశ్వాసం దళితులతో కలిగించాలి. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంత వరకూ 1985 జూలై 17న జరిగిన కారంచేడు దళితుల ఊచకోతకు నిరసనగా ప్రారంభించిన దళిత ఉధ్యమం ఈ రోజు ఏ దశలో వుంది? లేదా ఎ,బి,స,ిడ వర్గీకరణ ఉద్యమం దాదాపు పదిహేడు సంవత్సరాల క్రితం ప్రారంభించిబడింది. దాని ఫలితాలు ఏమిటి? దళిత ఉద్యమం అంఇమ లక్ష్యం రాజ్యాధికారం అంటున్నం. ఆ రాజ్యాధికారం ఎవరి దగ్గరి నుంచి లాక్కోవాలి? వారి శక్తి, యుక్తి, వారి పునాదులు (అగ్రకుల – రెడ్డి, కమ్మ, వెలమ భూస్వామ్మ శక్తులు) ఎలాంటివి? ఒక గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న దళిత యువకుడు ఇంత లోతుగా నేడు ఆలోచించే పరిస్థితిలో ఉన్యాడ? అనే ప్రశ్నలు ప్రస్తుత దళిత నాయకులనబడే వారందరూ వేసుకోవాలి. ఆ లెక్కకొస్తే, మన రాష్ట్రంలో స్వతంత్ర దళిత ఉధ్యమం ఇప్పుడు లేకనే పాలకవర్గం సరియైన గుణపాఠం చెప్పలేకపోతున్నాం. ఈరోజు అంబేద్కర్‌ యువజన సంఘాల పేరుమీద ఉన్నవారు, ఉద్యోగాలలో ఉన్న ఎస్‌.సి., ఎస్‌.టి., ఉద్యోగుల సంఘ నాయకులందరూ ఈ దేశ, రాష్ట్ర పరిస్థితులను అధ్యయనం చేయడం మరిచిపోయి, ఇప్పుడంతా జగన్‌, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌ రెడ్డిలలో ఎవరు బెటర్‌, ఎవరు మనలను వాడుకుంటారు, ఎవరికి సేవ చేస్తే పదవులు పొందవచ్చు అనే మీమాంసలో పడ్డారు.ఇది చాలా దారుణం. గ్రామాలలో నేడు సరియైన విద్య. వైద్యం, పారిశుధ్యం, నివాసం లేక రాష్ట్రంలో దళితుల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారలంతా అధికార పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతూ గ్రామాతలొని ప్రజలను బిచ్చగఓటాళ్ల మాదిరి చుస్తున్నారు. అసలు ‘మేం వారి (ప్రజల) సేవకులం’ అనే దృక్పథాన్ని ప్రస్తుత రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ఏనాడో మరిచిపోయింది. ఈ రోజు పోలీసుశాఖ పని కేవలం రియల్‌ ఎస్టేట్‌ మధ్య వర్తిత్వాలు చేయడం, లేదా ప్రేమించుకున్న యువతీ యువకులు పెళ్లిళ్లు చేయడం లేదా యాక్సిడెంట్‌ గొడవాలు సర్దుబాట్లు చేయడంగా ఉంది. దళిత నాయకులుగా, అంబేద్కర్‌వాదులుగా మనమంతా నిరంతరం అధ్యయనం చేస్తూ, రాజ్యాంగ హక్కులను, పోలీస్‌ మాన్యూవల్‌నూ గుర్తు చేయాల్సి వస్తున్నది. ఇది రాష్ట్రంలో నేడున్న దుస్థితి. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో మొట్టమొదట కూల్చబడిన అంబేద్కర్‌ విగ్రహం నుంచి లెక్కవేస్తే, ఇటీవలి తెనాలిలో పగలగొట్టిన ఆచార్య ఎన్‌.జి రంగా విగ్రహం, విజయవాడకు చెందిన వంగవీటి మోహనరంగా విగ్రహాల విధ్వంసాలకు ప్రోత్సహించారు. ప్రోత్సహించింది అన్నది ఇక్కడ తేలవలసిన విషయం.
పిసిసి అథ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి ఎస్‌ కిరణ్‌ కుమార్‌రెడ్డి, చిరంజీవతి తదితరుల ఆధిపత్య గొడవల మూలంగానే రాష్ట్రంలో అలజడి, ప్రజా ఘర్షణలను ప్రేరేపించడానికి, కొన్ని ప్రాంతాలలోని రాజకీయ నాయకులు సృష్టించిన అలజడే ఈ విగ్రహాల విధ్వంస కార్యరూపం. అయితే కొంతమంది దళిత నాయకులు అంబేద్కర్‌ విగ్రహాలకు పాలతో అభిషేకాలు చేస్తూ, పాలను వృధా చేస్తూ, సరికొత్త బ్రాహ్మణ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో మాజీ మంత్రి డాక్టర్‌ పి శంకర్‌రావుకు కూడా మందకృష్ణ నేతృత్వంలో ఈ పాలభిషేకం జరిగింది. (హోం మంత్రి కుమారుడదతిన అరెస్టు చేయాలని కోరుతూ ఏర్పాటు చేసిన సభలో శంకర్‌రావుకు పాలాభిషేకం చేశారు) ఇది అవసరమా? దళిత ప్రజలుగా మన కర్తవ్యాలు ఏమిటి? అసలే మన శత్రువులు ఎవరు? మిత్రలు ఎవరు? నాయవత్వం వహిస్తుంన్నది ఎవరు? ప్రభుత్వం అనగా ఏమి? రాజ్యం ఏమి? పోలీసు వ్యవస్థ ఎలాంటి వైఖరి తీసుకొంటున్నది? మన పాలకులు తీసుకుంటున్న సామ్రాజ్యవాద అనుకూల విధానా లపై ఏ విధంగా పోరు సల్పాలి? అనే ప్రశ్నలకు నేటి దళిత ఉద్యమకారుల వద్ద ఎలాంటి సమాధానం లేదు.
నేటి ప్రభుత్వ పాలనా వ్యవస్థలో పౌరుడు అనే పదానికి అర్ధం వస్తువుగా మారిపోయింది. సామ్రా జ్యవాద విషపోకడలు పెరిగిపో తున్న దశలో మనమంతా నేడు జీవిస్తున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని దారుణాలు చూడవలసి వస్తుంది. ఎదుర్కోవడానికి మన దగ్గర ఒక ప్రణాళిక ఉండాలి. పోరాడడానికి ఒక ఎజెండా కావాలి. సంఘాలు సంఘటితంగా పోరాడడానికి మరింత అదనపు బలం, త్యాగం అవసరం. ఇదే విషయాన్ని ప్రస్తుత, గతించని చరిత్ర తెలియజేస్తున్నది. అనేక గుణపాఠాలు నేర్చుకొని అడుగడు గునా మనకుగా మనమే అంచనా లు వేసుకుంటూ ఉద్యమించాలి. పోరాడాలి. ఎందువల్ల నేడు శత్రువు బహుముఖంగా ఉన్నాడు. అంటే భూస్వామి, పెట్టుబడి దారుడు, పోలీసు, రెవెన్యూ వ్యవస్థ(ఐఎఎస్‌, ఐపిఎస్‌), సారా కాంట్రాక్టర్లు, శాసనసభ్యులు, మంత్రులు, అందరూ శత్రువులే. వీరినంతా ఒకేసారి ఎదుర్కోలేం. వీరిని వివిధ సందర్భాలలో, వివిధ రకాలుగా, వివిధ రూపాలుగా ఎదుర్కొవాలి. అందుకు సరియైన శక్తిని సమీకరించుకోవాలి.
డాక్టర్‌ అంబేద్కర్‌ ఒక సందర్భంలో ఈ విధంగా అన్నాడు ‘మీ సొంతకాళ్లపై మీరు నిలబడి మీ హక్కు కోసం మీరు పోరాడుతూ, మీ ఉద్యమాన్ని మీరే నిర్మించుకోండి’. సొంతకాళ్లపై నిలబడడానికే నేడు పోరాడవలసి వస్తోంది. విద్యనభ్యసించడం కూడ నేడొక పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారమైంది. రాబోయే రోజుల్లో దళితులకు విద్యను దూరం చేయాలనే కుట్ర జరుగుతోంది. గ్రామ, గ్రామాన కనీసం మంచినీళ్లు లేవు కాని, మద్యం షాపులున్నాయి. చర్చ్‌లు, మసీదులు, దేవాలయాలు కొత్త కొత్తవి నిర్మించబడుతున్నాయి. వెలుస్తున్నాయి. గ్రంథాలయాలు నిర్మించుకోవడం లేదు. ప్రజాసంఘాలు స్వంత కార్యాలయాలు నిర్మించుకోవడం లేదు. ఇవి మనమంతా ఆవేదన, ఆందోళన చెందాల్సిన విషయాలు. అధికారబలంతో, అగ్రకుల, భూస్వామ్య శక్తులు అన్ని రంగాలను కలుషితం చేస్తున్న నేటి పరిస్థితులలో, వారిని ఎదుర్కొని, గ్రామాలలో పోరాడడం చాలా కష్టంతో కూడుకున్న సంగతి. కాబట్టి మార్క్సిస్ట్‌-లెనినిస్ట్‌ ఉద్యమాలతో మమేకం కావాలి. మావో ఆలోచనా విధానాన్ని బలపరచాలి. అంబేద్కర్‌ పేరును ఉచ్చరిస్తూ జీవించడం కాదు. భారతదేశ నిర్ధిష్ట పరిస్థితులకు అన్వయించుకొని విప్లవబాటలో దళితులంతా నడవాలి.
– చిమ్మె జాన్‌ బర్నబాస్‌