టీజీపీఎస్సీ గ్రూప్-2 ఫలితాలు విడుదల
– 783 పోస్టుల భర్తీకి జనరల్ ర్యాంక్‌లు ప్రకటించిన టీజీపీఎస్సీ
హైదరాబాద్(జనంసాక్షి): గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 783 పోస్టులకుగానూ ఎంపికైన 782 మంది జాబితాను వెల్లడిరచింది. ఒక్క పోస్టు ఫలితాన్ని పెండిరగ్‌లో పెట్టింది.783 పోస్టులకు గతేడాది నవంబర్‌లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించింది. 2022లో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ.. 2024 డిసెంబరులో రాత పరీక్ష నిర్వహించింది. ఈ ఏడాది మార్చి 11న జనరల్ ర్యాంకుల జాబితాను వెల్లడిరచింది. ఇప్పటికే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసింది.