అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

.

-విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
-టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్

టేకులపల్లి, సెప్టెంబర్ 13( జనం సాక్షి ): 13 న (నేడు) యు.ఎస్.పి.సి ఆధ్వర్యంలో జరిగే చలో అసెంబ్లీకి వెళ్లకుండా యు ఎస్ పి సి జిల్లా స్టీరింగ్ కమిటీ నాయకులు గూగులోత్ హరిలాల్,భూక్య కిషోర్ సింగ్ లను బైండోవర్ ల పేరుతో ముందస్తుగా అరెస్టు చేయడం ప్రభుత్వం తమ వైఫల్యాలను దాచిపెట్టే ప్రయత్నంలో భాగమే, దీనిని యు.ఎస్.పి.సి జిల్లా నాయకులు గుగులోత్ హరిలాల్ తీవ్రంగా ఖండించారు.
ఒకరోజు ముందే భద్రాద్రి కొత్తగూడెం, ఇతర జిల్లాల్లో నాయకుల అరెస్టులు ప్రశ్నిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులపై ప్రభుత్వ అణిచివేతకు నిదర్శనం అన్నారు. విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం ద్వారా ప్రజలకు నాణ్యమైన విద్యనదించే ఒక విశాల ప్రయోజనం కోసం ఉద్యమిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులపై ప్రభుత్వ అణిచివేత వైఖరిని యూఎస్పిసిగా తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రెండు టర్ముల కాలంలో విద్యపై తమ ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యాన్ని సమీక్షించుకుని ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులు,నియామకాలు చేపట్టి విద్యాపర్యవేక్షకాధికారుల పోస్టుల నుండి ఎస్జీటీ పోస్టుల వరకూ నింపి, విద్యా ప్రమాణాలలో రాష్ట్ర స్థాయిని ఒక గౌరవప్రదమైన స్థాయికి పెంచాలని; జీవో-317 ద్వారా ఉత్పన్నమైన అన్ని సమస్యలు సాగతీత లేకుండా పరిష్కరించాలని, సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని,పాఠశాలల్లో అన్ని మౌళిక సదుపాయాలు కల్పించి, సర్వీస్ పర్సన్స్ నియామకాలు చేయాలని, పాఠశాలల గ్రాంట్లు విడుదల చేయాలని, జీతాలు ప్రతినెల 1వ తేదీన సక్రమంగా చెల్లించాలని డిమాండ్ చేశారు