అఖిల భారత సర్వీసు అధికారుల విభజన పూర్తి

3

ఏపీకి 161, తెలంగాణకు 133 ఐఏఎస్‌లు

న్యూఢిల్లీ,మార్చి5(జనంసాక్షి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు సంబంధించిన అఖిలభారత సర్వీసు అధికారుల విభజనకు సంబంధించిన తుదిజాబితాకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు సివిల్‌ సర్వీసులను ఆమోదిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏపీకి 161 ఐఏఎస్‌లను కేటాయించగా తెలంగాణకు 133 మందిని కేటాయించింది. ఇక ఐపీఎస్‌ల విషయానికొస్తే తెలంగాణకు 95 మందిని అలానే ఆంధ్రప్రదేశ్‌కు 116 మందిని కేటాయించింది. కాగా అఖిలభారత సర్వీసు అధికారుల విభజనకు సంబంధించి కేంద్రం నియమించిన ప్రత్యూష్‌సిన్హా కమిటీ సిఫార్సుల మేరకే అధికారుల తుది జాబితాను సిద్ధం చేశారు.