అధికారంలోకి వస్తాం.. ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసి చూపుతాం..

అధికారంలోకి వస్తాం.. ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసి చూపుతాం..

టేక్మాల్ జనం సాక్షి నవంబర్ 5 తెలంగాణ రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంటుందని సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే ఉందని అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని అన్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా టేక్మాల్ లో ప్రచారాన్ని కొనసాగించారు మండల పార్టీ అధ్యక్షులు నిమ్మ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. రైతు భరోసా పథకం కింద 15 వేల రూపాయలు, కౌలు రైతుకు 12 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు ఇందిరమ్మ ఇంటి పథకం నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ప్రతి మహిళకు ప్రతినెల మహాలక్ష్మి పథకం 2500 రూపాయలు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేయడం జరుగుతుందని అన్నారు. కెసిఆర్ పాలన పై ప్రజలకు విరక్తి కలిగిందని స్పష్టం చేశారు రానున్న రోజుల్లో తెలంగాణలో ప్రజలకు మంచి రోజులు రానున్నాయని అన్నారు. తెలంగాణలో గెలుపు కాంగ్రెస్ పార్టీ దే అని అన్నారు. అందోల్ ఎమ్మెల్యే అభ్యర్థి దామోద రాజనర్సింహకు చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ ప్రచారంలో మండల కో ఆప్షన్ మజార్, మాన్ కిషన్, కిషోర్, పాపయ్య, తిమ్మిగారి సుధాకర్, అనిల్, సాగర్, లక్ష్మీనారాయణ, శివ కుమార్, తదితరులు పాల్గొన్నారు.