హయత్ నగర్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌లో విద్యార్థిని అనుమానాస్పద మృతి

అబ్దుల్లాపూర్మెట్, (జనం సాక్షి): హయత్ నగర్ బాలికల ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న సౌమ్య అనే విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. విద్యార్థి మృతిపై ఇంకా స్పష్టమైన వివరాలు వెలుగులోకి రాకపోవడంతో స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకునేందుకు జనం సాక్షి రిపోర్టర్ ఫోన్ ద్వారా సంప్రదించగా, అధికారులు స్పందించకుండా మౌనం వహించారు. విద్యార్థి మృతిని గోప్యంగా దాచుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సౌమ్య మృతికి గల అసలు కారణాలను తెలియజేయాలని ప్రజలు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు పట్టుబడుతున్నారు.