ఘనంగా గణతంత్ర వేడుకలు
` ఢల్లీి కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి
` హాజరైన ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్
న్యూఢల్లీి(జనంసాక్షి):గణతంత్ర వేడుకల సందర్భంగా దిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం ఈసారి ప్రత్యేకత. వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు. ’స్వర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్’ అనే ఇతివృత్తంతో ఈసారి కవాతులో పాల్గొనే శకటాలకు రూపకల్పన చేశారు. బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణులు, పినాక మల్టీబ్యారెల్ రాకెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కర్తవ్య పథ్‌పై హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు 9 కిలోవిూటర్ల మేర రిపబ్లిక్ డే పరేడ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రాలు, యూటీలు, కేంద్ర శాఖలకు చెందిన 31 శకటాలను ప్రదర్శిస్తున్నారు.
శక్తిని చాటిన త్రివిధ దళాలు
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ‘స్వర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్’ అనే థీమ్‌తో శకటాలను రూపొందించారు. బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణులు, పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మిలిటరీ కవాతులో త్రివిధ దళాలు తమ సత్తా చాటాయి. కర్తవ్యపథ్‌లో 9 కి.విూ మేర ఈ కవాతు కొనసాగుతోంది.గణతంత్ర వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకకు ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన రాష్ట్రపతితో కలిసి ప్రత్యేక గుర్రపు బండిలో వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం సైనిక దళాల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. 300 మంది కళాకారుల బృందం వివిధ రకాల దేశీయ వాయిద్యాలతో ‘సారే జహాసే అచ్చా’ గీతాన్ని వాయించారు. అనంతరం గగనతలం నుంచి హెలికాప్టర్‌లు పూల వర్షం కురిపించాయి. గ్రూప్ కెప్టన్ అలోక్ అహ్లావత్ దీనికి నాయకత్వం వహించారు.ఇండోనేసియాకు చెందిన నేషనల్ ఆర్మ్‌డు ఫోర్సెస్ నుంచి 152 మంది బృందం కవాతులో పాల్గొంది. మరో 190 మంది సభ్యుల బ్యాండ్ బృందం మార్చ్ నిర్వహించింది.లెఫ్టినెంట్ అహాన్ కుమార్ నేతృత్వంలోని 61 మంది అశ్విక దళం కవాతు నిర్వహించింది. అనంతరం ట్యాంక్ `90 ఃఓఖ`2 శరత్‌తో పాటు నాగ్, బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలు, పినాక, అగ్నిబాణ్ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్లు, ఆకాశ్ వెపన్ సిస్టమ్, చేతక్, బజరంగ్, ఐరావత్‌తో సహా పలు ఆయుధాలను ప్రదర్శించారు.ఈ వేడుకల్లో త్రివిధ దళాలు సంయుక్తంగా ప్రదర్శించిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘సశక్త్ ఔర్ సురక్షిత్ భారత్’ అనే థీమ్‌తో దీన్ని తయారు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఐదు వేల మంది కళాకారులు ‘జయతి జయ మహాభారతం’ పాటకు 11 నిమిషాల పాటు సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు.మోటారు సైకిళ్లపై డేర్‌డెవిల్స్ చేసిన విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి. బుల్లెట్ సెల్యూట్, ట్యాంక్ టాప్, డబుల్ జివ్మిూ, డెవిల్స్ డౌన్ వంటి అంశాలను ప్రదర్శించారు. 22 ఫైటర్ జెట్‌లు , 11 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఏడు హెలికాప్టర్‌లు వైమానిక ప్రదర్శన వీక్షకులను కట్టిపడేసింది. వీటిలో రఫెల్, సు`30, జాగ్వార్, సి`130,సి`295, సి`17, డోర్నియర్`228, ఏఎన్`31 విమానాలతో పాటు ఎమ్‌ఐ`17 హెలికాప్టర్లు ఉన్నాయి.