పెద్ద ధన్వాడకు భారీగా చేరిన రైతులు

రాజోలి (జనంసాక్షి) : పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం ఏడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా 1500 మంది రైతులతో ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి, అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. పరిశ్రమ ఏర్పాటును రద్దు చేసేంతవరకు మీ వెంటే మేం ఉంటామని హామీనిచ్చారు. దిలావర్‌పూర్‌లో ఇథనాల్‌ ఫ్యాక్టరీ రద్దు కావడంతో, మన ప్రాతంలో కూడా రద్దు అవుతుందని ఎమ్మెల్సీ భరోసా ఇచ్చారు. పరిశ్రమ ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. ఇథనాల్‌ ఫ్యాక్టరీ రద్దు చేయాలని త్వరలేనే సీఎంతో మాట్లాడుతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు వడ్డేపల్లి శ్రీనివాసులు, ఆయా గ్రామాల 1500 మంది రైతులు పాల్గొన్నారు.