అధికారంలోకి వస్తే మద్య నిషేధం
జయలలిత
చెన్నై,ఏప్రిల్ 9(జనంసాక్షి):
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా మద్యంపై నిషేధం విధిస్తామని తమి ళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. 20 16 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం జయలలిత శనివారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తమ పార్టీ నెగ్గితే దశల వారీగా మద్యం దుకాణాలను తగ్గిస్తూ.. రాష్ట్రంలో మద్యంపై పూర్తి స్థాయిలో నిషేధం తీసుకొస్తామన్నారు. ఇటీవల బిహార్‌లోనూ మద్యంపై సంపూర్ణ నిషేధం విధించిన విషయం తెలిసిందే