అధికార నివాసానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

4

హైదరాబాద్‌,మార్చి5(జనంసాక్షి):రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార నివాసం నిర్మాణానికి హైదరాబాద్‌ లోని పంజాగుట్టలో సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. 8.9 ఎకరాల స్థలంలో ఈ భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు, ఆర్‌ అండ్‌ బి శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ, సిఎంఓ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుతం బేగంపేటలో ఉన్న ముఖ్యమంత్రి అధికార నివాసం సమావేశాలకు ఏమాత్రం అనువుగా లేదు. అధికార నివాసంలో ముఖ్యమంత్రి ప్రతీరోజు సవిూక్షలు నిర్వహిస్తారు. విధానపరమైన నిర్ణయాల కోసం ముఖ్య అధికారులతో సమావేశాలు జరుగుతుంటాయి. ఇందుకోసం ఎంసిఆర్‌ హెచ్‌ఆర్డీకో.. మరో చోటికో వెళ్లాల్సి వస్తున్నది. ముఖ్యమంత్రిని కలవడానికి నిత్యం వేరే రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, దేశ, విదేశాల నుంచి ప్రముఖులు వస్తారు. వారి కార్లు కూడా సీఎం అధికార నివాసంలో పార్కు చేసే పరిస్థితి లేదు. ప్రస్తుత నివాసంలో ఒక్క ముఖ్యమంత్రి కారు తప్ప మిగతా కార్లు పట్టవు. దీంతో.. మిగతా కార్లకు రోడ్డే పార్కింగ్‌ ఏరియాగా మారుతున్నది. ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చే సందర్శకులకు కూడా నిలువ నీడ కూడా ఉండడం లేదు. ఫలితంగా సందర్శకులను కూడా సీఎం కలవలేకపోతున్నారు. ప్రస్తుత సీఎం అధికారిక నివాస సముదాయంలో కలెక్టర్ల కాన్ఫరెన్సులు, ఇతర ముఖ్య సమావేశాలకు అనువైన సమావేశ మందిరం లేదు. కలెక్టర్ల కాన్ఫరెన్సును ¬టళ్లలో పెట్టుకోవాల్సిన దుస్థితి. క్షేత్ర స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించుకోవాలంటే జెఎన్టీయూకో, అగ్రికల్చర్‌ యూనివర్సిటీకో పోవాల్సి వస్తోంది. మిషన్‌ కాకతీయ సమావేశం జెఎన్టీయూలో, మిషన్‌ భగీరథ సమావేశం అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో నిర్వహించాల్సి వచ్చింది. చివరకి క్యాబినెట్‌ విూటింగ్‌ జరిగినప్పుడు భోజనాలు చేయడానికి మంత్రులు బయట ¬టల్స్‌ కు వెళ్లక తప్పడం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి అధికార నివాసము, కార్యాలయము, సమావేశ మందిరం ఉండేలా కొత్త భవన సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. పంజాగుట్టలోని 8.9 ఎకరాల స్థలంలో అధికార నివాస సముదాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంఖుస్థాపన చేశారు.