అన్ని వర్గాలకు సమానంగా సంక్షేమ పథకాలు-

     ఆసరా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్.                                                                      వట్టిపల్లి ( జనం సాక్షి) సోమవారం
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు కొత్త పింక్షన్ లను 65 నుండి 57 సంవత్సరాలకు కుదించి కొత్త పెంక్షన్ లను మంజూరు చేసాడని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం కొత్తగా మంజూరైన ఆసరా పెన్షన్ పత్రాలను లబ్ధిదారులకు అందజేయాగ పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ షాదిముబారక్ చెక్కులను అందజేశారు. కొత్తగా పెన్షన్ లు మంజూరైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అభినందనలు తెలియజేశారు.మండలంలోని మొదటగా పోతులబొగుడ మెడికుందా వట్ పల్లి గొర్రెకల్ గౌతపూర్ ఖాదిరాబాద్ మర్వేల్లి బిజిలిపూర్ గ్రామాల్లో లబ్ధిదారులకు ఎమ్మెల్యే పింక్షన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎదో విధంగా ప్రతి ఇంటికీ చేరాయని తెలిపారు. కరోన సంక్షోభం వల్ల కొత్త పెన్షన్ లు కొంత ఆలస్యం కాగా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు కేసీఆర్ ఇంటికి పెద్ద కొడుకులా కొత్త పెన్షన్ లను అందజేసినట్టు తెలిపారు. నియోజకవర్గంలో దశల వారిగా అన్ని మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఎమ్మెల్యే కార్యకర్తలకు నాయకులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో అందోల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో వట్ పల్లి మండలంలోని మార్కెట్ కమిటీ చైర్మైన్ మరియు డైరెక్టర్లు, ఎంపిపి, వైస్ ఎంపిపి మరియు ఎంపిటిసిలు, జడ్పీటీసీ, ‘వరము’ చైర్మెన్ మరియు డైరెక్టర్లు, పిఎసియస్ చైర్మెన్ మరియు డైరెక్టర్లు, రైతు బంధు అద్యక్షులు, అన్ని గ్రామాల సర్పంచ్ లు, గ్రామ తెరాస పార్టీ అద్యక్షులు, గ్రామ రైతుబంధు అద్యక్షులు, ఉప సర్పంచ్ లు, వార్డుమెంబర్లు, విద్యాకమిటీ చెర్మెన్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ అన్ని అనుబంధ సంస్ధలు అద్యక్షులు కార్యవర్గం, పార్టీ జిల్లా మరియు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు..