అభివృద్ధి గణాంకాల్లో కాదు

4
-సామాన్యుడి చిరునవ్వే ప్రగతికి సంకేతం

-యూనెస్కో వార్షికోత్సవంలో ప్రధాని మోదీ

ప్యారిస్‌, ఏప్రిల్‌ 10 (జనంసాక్షి):

అభివృద్ధిని గణాంకాల్లో చెప్పుకోవడం కాదు.. సామాన్యుల ముఖాల్లో ఆనందం చూడాలని ప్రధాని మోడీ అన్నారు. సామాన్యులు సంతోషంగా ఉంటేనే అభివృద్ది సాధ్యమయ్యిందని గుర్తించాలన్నారు.  మారుమూల గ్రామాల్లోని యువత నైపుణ్యం సాధించేందుకు బృహత్‌ కార్యక్రమం చేపట్టామని గుర్తు చేశారు. యువతను మేల్కొల్పటమే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. శాశ్వత శాంతి కోసం విద్య ప్రధానమన్న గాంధీ వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నానని పేర్కొన్నారు. యునెస్కో 70వ వార్షికోత్సవంలో ప్రసంగించడం గౌరవంగా భావిస్తున్నా అని తెలిపారు.యునెస్కో 70వ వార్షికోత్సవం సందర్భంగా యునెస్కో ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు.  సాంకేతిక, విద్యా, సైన్స్‌ అభివృద్ధిలో భారత్‌, యునెస్కో దూరదృష్టితో ఉన్నాయని స్పష్టం చేశారు.  సాంకేతికత, విద్య, సైన్స్‌ అభివృద్ధిలో భారత్‌, యునెస్కో దూరదృష్టితో ఉన్నాయని ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించడం గొప్ప /-నరవమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అనేక సవాళ్లను మనం ఎదుర్కొంటున్నామని, అయితే వాటిని దీటుగా ఎదుర్కొనగలగడంలో పురోగతి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రశాంత, సౌభాగ్య భవిష్యత్‌ సాధనే మన సామూహిక లక్ష్యం కావాలన్నారు. వృద్ధిని గణాంకాల్లో చెప్పుకోవడం కాదని, సామాన్యుల ముఖాల్లో ఆనందం చూడాలని ఆయన ఆకాంక్షించారు. ఆడపిల్లలందరూ బడికెళ్లి చదువుకోవాలన్నారు. మారుమూల గ్రామాల్లోని యువత నైపుణ్యం సాధించేందుకు బృహత్‌ కార్యక్రమం చేపట్టినట్లు ప్రధాని తెలిపారు. యువతను మేల్కొల్పడమే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం లక్ష్యమన్నారు. శాశ్వత శాంతి కోసం విద్య ప్రధానమన్న గాంధీ వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు.  ప్రపంచాన్ని ఐక్యంగా ఉంచడంలో యునెస్కోది కీలక పాత్ర అని, యునెస్కో ఏర్పాటు నుంచి మన బంధం దృఢమైనదని తెలిపారు.  ప్రపంచాన్ని ఒక్కటి చేయటంలో యునెస్కో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. యునెస్కో 70వ వార్షికోత్సవంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. యునెస్కో 70వ వార్షికోత్సవంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి కారణంగానే శాంతి వర్ధిల్లుతుందని చెప్పారు. అనేక సవాళ్లను మనం ఎదుర్కొంటున్నాం.. వాటిలో పురోగతి ఉందన్నారు. మన సామూహిక లక్ష్యం ప్రశాంత, సౌభాగ్య భవిష్యత్‌ సాధనే కావాలని పిలుపునిచ్చారు. సాంకేతికత, విద్య, సైన్స్‌ అభివృద్ధిలో భారత్‌, యునెస్కో దూరదృష్టితో ఉన్నాయని తెలిపారు.  ఈ సందేశాన్ని యునెస్కోకు గాంధీ అప్పట్లో ఇచ్చారని గుర్తు చేశారు. వారసత్వ సంపద పరిరక్షణలో యునెస్కో చొరవ భారత్‌కు స్ఫూర్తినిస్తుందన్నారు. సంస్కృతి ప్రపంచం మొత్తాన్ని కలుపుతుందన్నారు. ఆడపిల్లలందరూ బడికెళ్లి చదువుకోవాలని పిలుపునిచ్చారు.