*అభివృద్ధి పనులను ప్రారంభించిన సర్పంచ్ ఎంపీటీసీ*
పెద్దేముల్ అక్టోబర్ 20 (జనం సాక్షి)
పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలో గురువారం నాడు సర్పంచ్ శ్రావణ్, ఎంపీటీసీ శ్రీనివాస్ రెండు లక్షల ఎంపీపీ నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎంపీటీసీ లో మాట్లాడుతూ… గ్రామంలో అన్ని వార్డుల్లో దశలవారీగా సమస్యలన్నింటిని పరిష్కరిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పద్మ వార్డు సభ్యులు కిరణ్, మోహిధ్, టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ రెడ్డి, సత్తార్, సామెల్, గౌస్, ఫెరోజ్, ఆయాజ్ తదితరులు పాల్గొన్నారు.