అభివృద్ధి లక్ష్యంగా సీఎం కెసిఆర్
మౌలిక వసతులు కల్పించటమే ధ్యేయంగా ఎంపీపీ ఈదురు రాజేశ్వరి
స్థానిక సర్పంచ్ రావుల శ్రీనివాస్ రెడ్డి
పెద్దవంగర అక్టోబర్ 10(జనం సాక్షి )తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతులు కల్పించటమే దేయ్యంగా పనిచేస్తున్నారని ఎంపీపీ ఈదురు రాజేశ్వరి పెద్దవంగర అన్నారు.ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి సహకారంతో సోమవారం చిట్యాల గ్రామంలో ఎం పి పి ఎస్ పాఠశాలలో మన ఊరు – మన బడి ప్రోగ్రామ్ లో భాగంగా స్థానిక సర్పంచ్ రావుల శ్రీనివాస్ రెడ్డి తో కలిసి 6లక్షలు రూపాయలతో టాయిలెట్స్(బ్లాక్స్) కు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. తరువాత ఎంపీపీ మాట్లాడుతూ మన ఊరు మన బడి ప్రోగ్రామ్ ద్వారా బడుగు బలహీన వర్గాల పిల్లలకు మంచి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని తెలిపారు. మండలంలో మన ఊరు మనబడి కింద్ర మంజూరు ఐనా ప్రహరీ గోడలు,డార్మెట్ మరియు టాయిలెట్స్ పనులను వెంటనే మొదలు పెట్టించాలని ఏ ఈ ఈ అశోక్ కు చూచించారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఈదురు ఐలయ్య,ఏ ఈ ఈ అశోక్,జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆర్ రాజు, విద్యకమిటీ చైర్మన్ పోతుగంటి శ్రీశైలం,జడ్పీస్స్ , ఎంపీపీస్ ప్రధానోపాధ్యాయులు ఎం .వెంకన్న, నరేష్,వార్డు సభ్యులు ఈదురు మంజుల,తెరాస నాయకులు ఆవుల కొమురల్లి,రాపోలు సుదర్శన్,దేశెట్టి నారాయణ,తెరాస గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు మొగులగాని హరీష్,వల్లపు పరమేష్, గ్రామ యూత్ అధ్యక్షులు దేశెట్టి మహేష్,గ్రామ కార్మిక విభాగం అధ్యక్షులు ఆకుల వెంకన్న, మాజీ వార్డు సభ్యులు ఈదురు వెంకన్న, ఈదురు మధు, దండు అశోక్, గుంటుక సురేష్, యూత్ నాయకులు రాపోలు మనోహర్, మొగులగాని సాగర్, గుంటుక రాజు, అనపురం ఉపేందర్, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు