టీజీఎండిసి చైర్మన్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం

జూన్ 17 (జనం సాక్షి) భీమ్గల్ పట్టణం కేంద్రంలో లింబాద్రి గుట్ట వడ్డెర కాలనీలో
మొన్న దురదృష్టవశాత్తు కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటనలో బాధిత కుటుంబాలను ఈరోజు టీజీఎండిసి చైర్మన్ శ్రీ అనిల్ ఈరవత్రి పరామర్శించారు.ఘటన విషయం తెలిసిన వెంటనే స్పందించిన ఆయన, బాధిత కుటుంబాలకు రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం అనిల్ యువసేన సభ్యులతో కలిసి కుటుంబాలను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకొని, నిత్యావసర సరుకులను అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,. ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసిందని, బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కష్టకాలాన్ని కుటుంబ సభ్యులు ధైర్యంగా ఎదుర్కొని, మనోధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు.బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, మృతి చెందిన చిన్నారుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బోదిరే నాగమణి స్వామి. వైస్ చైర్మన్ సంటి లత నర్సయ్య. కౌన్సిలర్ నాగేంద్ర. అనంతరావు. కన్నె సురేందర్. సురేష్. పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు



