గ్రామాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తాం

ఇందల్వాయి నూతన చైర్మన్గా ఎస్ కే రియాజ్
ఇందల్వాయి ( జనం సాక్షి) జూన్. 17: ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులుగా ఎస్ కే రియాజును ఎన్నుకోవడం అయినది ఉపాధ్యక్షులుగా మూడేగామ సాయిలు. క్యాషియర్ గా తేలు రాములు. గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ ఎన్నికల్లో గ్రామ శాఖ అధ్యక్షులుగా ఎన్నికైన ఎస్ కే రియాజ్ మాట్లాడుతూ. తనపై గ్రామ ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయగలరని అన్నారు గ్రామ ప్రజలు సంక్షేమం కొరకు అంకిత భావంతో పనిచేస్తానని అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తానని రియాజ్ తెలిపారు. గ్రామ అభివృద్ధికి తన వంతు సేవలు అందిస్తానని ప్రజల సమస్యలు పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని రియాజ్ అన్నారు. అనంతరం ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడిన మూడేగా సాయిలు గ్రామ ప్రజలకు అభివాదాలు చేస్తూ. శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామ సర్పంచ్ గంగమని గంగారం మాట్లాడుతూ ఏ చైర్మన్ వచ్చినా ఎవరొచ్చినా ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన అన్నారు ఉప్పసర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి సమస్యలైనా వీడీసీ సభ్యులు ముందుండి నడిపించాలని శ్రీనివాస్ అన్నారు సంవత్సరంలో జరిగే ప్రతి పనిలో ముందుండి మీ వంతు కృషి అందించాలని శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నుకోబడ్డ కార్యవర్గ సభ్యులు క్యాషియర్ తేలు రాములు. మంగలి భూమేష్. ఎడిపల్లి నడిపి సాయిలు. బండి సుదర్శన్. తుమ్మల సత్యం. సాకలి పెద్ద సాయిలు. బాగిర్తి నారాయణ. ఈ నడిపి సాయిలు. ఎండి అమీనుద్దీన్ షేక్ ఖాదర్ పాషా కే గణేష్ మాణిక్యం. నావల్ల గంగాధర్ బుట్టి గంగాధర్ దాసరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు