ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న ఎమ్మార్వో

ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎమ్మార్వో బాలయ్య
ఇందల్వాయి ( జనం సాక్షి)జూన్. 17 ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామ ప్రధానిగా పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మార్వో జి బాలయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల కిచెన్ రూమ్ పరిశుభ్రంగా విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యమైన మెనూ అమలు తదితర అంశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ విద్యార్థులకు న్యాయమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కిచెన్ రూమ్ తో పాటు పాఠశాల పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని తెలిపారు. అలాగే విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించడంలో లేదా మెనూ ప్రకారం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లోకని గంగమణి గంగారం. ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఆర్ ఐ ప్రవీణ్ కుమార్. జిపిఓ ప్రమోద్ గంగారాములు పాల్గొన్నారు



