సర్ సర్వే వివరాలను పక్కగా నిర్వహించాలి

దస్తూరాబాద్, జూన్ 17 (జనంసాక్షి)::జూన్ 25 నుండి జూలై 24 వరకు నిర్వహించే సర్ సర్వే వివరాలను ఎలాంటి తప్పిదాలు లేకుండా ఆన్లైన్ లో నమోదు చేయాలని ఆర్డీఓ రాథోడ్ మొహన్ సింగ్ తెలిపారు. బుధవారం స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడుతూ సర్ సర్వే వివరాలు పక్కగా ఆన్లైన్ చేసే విధం గురించి ఆయన వివరించారు. అలాగే బూత్ లెవల్ అధికారులకు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి లకు మరియు రేషన్ షాప్ డీలర్స్ కు అవగాహన కల్పించడం జరిగినది. సర్వే ఎలా చేయాలి అనే అంశం మీద క్లుప్తంగా వివరించడం జరిగినది. ఇట్టి అవగాహన సదస్సులో తహసీల్దార్ కనక యాదవ్ రావు, ఉట్నూర్ తహసీల్దార్ కోట్నాక రఘునాథ్ రావు, ఉట్నూర్ ఆర్డీఓ సబ్బా రమేష్, అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, రేషన్ షాప్ డీలర్స్ పాల్గొన్నారు.