అకొండపేట ప్రాథమిక పాఠశాలలో అక్షరాబ్యాసం

దస్తూరాబాద్, జూన్ 17 (జనంసాక్షి):: మండల కేంద్రంలోని అకొండపేట ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులకు అక్షరాబ్యాస కార్యక్రమం నిర్వహించామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భాస్కర్ తెలిపారు. పాఠశాలలు తిరిగి పునః ప్రారంభం కావడంతో విద్యార్థులకు అక్షరాబ్యాసం కార్యక్రమం నిర్వహించామని ఆయన అన్నారు. విద్యార్థులు విద్య బుద్దులు నేర్పే గురువులు అక్షరాబ్యాసం చేయడం గొప్ప విషయంగా భావించాలని ఆయన అన్నారు. విద్యార్థులు సర్కారు బడులలో మాత్రమే విద్యను అభ్యశించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయుడు అనిల్, పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ, సర్పంచ్ మాదవి శంకర్, అంగనవాడి సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.



