అమరుల కుటుంబాలకు స్వాంతన
తెలంగాణ అవతరణ ఉత్సవాలకు ఇప్పుడు ప్రత్యేకత ఏర్పడింది. రెండో అవతరణ ఉత్సవాలు మరింత ఆకర్షణీయంగా, ప్రజలు ఆకట్టుకునేలా, రాస్టప్రండుగలా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ రెండేళ్లలో తెలంగాణలో సిఎం కెసిఆర్‌కు ఎదురు లేకుండా పోయింది. అంటే ఆయన చేస్తున్న పనులు కావచ్చు లేదా… ప్రజలు చూపిస్తున్న ఆదరణ కావచ్చు మొత్తంగా తెలంగాణ ఓ డైరెక్షన్లో ముందుకు ఆసగుతోంది. తొలి ఏడాదంతా సర్దుబాట్లతోనే గడిచింది. రెండేళ్లయినా ఇంకా ర్దుబాట్లు ఉన్నా కొంతమేర పునాది పడేలా కార్యక్రమాలు సాగుతున్నాయి. ప్రధానంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, విద్యుత్ సరఫరా పథకాలు బాగా ప్రాచుర్యం పొంది ప్రజల్లో కెసిఆర్ అంటే ఓ ఇమేజ్ క్రియేట్ చేశాయి. మారుమూల గ్రామానికి వెళ్లినా మాకైతే కరెంట్ కోతలు లేవన్న ప్రజల మాటలే కెసిఆర్‌కు దీవెనలుగా మారాయి. అంతేగాకుండా వరుస ఎన్నకల్లో గెలుపులు కూడా కెసిఆర్ ఆత్మస్థయిర్యాన్ని పెంచాయి. తాను చేస్తున్న పనులకు ప్రజల ఆమోదంకావాలి. ఎన్నికల ఫలితాల ద్వారా అవి ఎప్పటికప్పుడు రుజువవుతూ వస్తున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో రాజకీయంగా ఎదుర్కొనేలా ఎలాంటి ఎన్నికలు లేవనే చెప్పాలి. రాజ్యసభ ఎన్నికలు పెద్దగా ప్రజలతో సంబంధం లేనివనే చెప్పాలి. అందుకే ఈ రెండేళ్ల పాలనలో సిఎం కెసిఆర్ త్రివిక్రముడిగా మారారు. అందుకే రెండేళ్ల తెలంగాణ సంబరాలు ప్రత్యేకతను సంతరించుకో బోతున్నాయి. ఇక మరీ ప్రత్యేకత అంటే అమరుల కుటుంబాలను సన్మానించుకోవడం, రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించడం ఓ చారిత్రక ఘట్టంగా గుర్తు చేసుకోవాలి. అందుకే ఈ అవతరణ వేడుకలు పూర్తిగా ప్రజలతో మమేకమయ్యేవిగా చూడాలి. జూన్ 2న జరిగే రాష్ట్ర ఆవతరణ దినోత్సవం రోజున ఉద్యోగ నియామక ప్రతాలు అందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఇప్పడుఉ అమరుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరయనుంది. తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిని తెలంగాణకోసం పోగొట్టుకున్నా తమకు సంతృప్తి మిగిలేలా సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకుంటున్నందుకు ఆనందంగా ఉంఉటుందని భావించాలి. ఇక ఆరోజున ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు ఆయా జిల్లాలకు చెందిన అమరవీరుల కుటుంబాలను సన్మానించి, ఈ నియామక ప్రతాలను అందజేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ లోగా అన్ని జిల్లాల్లో నియామక ప్రతాలు తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లో జరిగే ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కొందరికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు. ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబ సభ్యులు సూచించిన వ్యక్తికి ఉద్యోగ అవకాశం ఇవ్వాలని తెలిపారు. కనీస విద్యార్హతలు లేకున్నా ఉద్యోగమిచ్చి అర్హతలు సాధించడానికి ఐదేళ్ల సమయం ఇవ్వాలని కూడా సీఎం కేసీఆర్ సూచించారు. రాష్ట్ర ఆవతరణ దినోత్సవం ఈ సందర్భంగా చేయాల్సిన కార్యక్రమాల గురించి సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేవౄలు ఇచ్చారు. దీంతో ఈ అవతరణ ఉత్సవాలకు అందుకే ప్రత్యేకత ఏర్పడింది. 2న జరిగే రాష్ట్ర ఆవతరణ దినోత్సవం రోజున పతాకావిష్కరణ, అవార్డుల ప్రదానం తదితర కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతలను అప్పగించారు. ఇదొక్కటే కాకుండా రాష్ట్ర పండుగాలా దీనిని నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రతీ జిల్లాకు రూ. 30 లక్షలు కేటాయించారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గ్రామస్దాయి నుండి రాజధాని వరకూ పండుగ వాతావరణంలో అందరూ పాల్గొనేట్లు చర్యలు తీసుకోబోతున్నారు. బంగారు తెలంగాణా సాధనపై డిబేట్లు, సదస్సులు, విద్యార్దులకు వ్యాసరచన, పోటీలు నిర్వహింస్తారు. జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, సినిమాహాళ్ళు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, మాల్స్‌తో పాటు ప్రముఖ ప్రాంతాలను విద్యుద్దీకరించటంతో పాటు రక్తదాన శిబిరాలు, అనాధ శరణాలయాలు, ఆసుపత్రుల్లో పండ్లు పంపిణీ, కవిసమ్మేళనాలు, ముషాయిరాలు, ప్రత్యేక రన్ తదితర కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా ప్రజలను భాగస్వాములను చేయబోతున్నారు. జిల్లాల్లో అమరవీరుల స్ధూపాలకు నివాళులర్పించిన తర్వాత వివిధ రంగాల్లో నైపుణ్యం కనబరచిన 25 మంది నిపుణులకు అవార్డులు, ప్రత్యేక డాగ్ షో, హార్స్షోలను కూడా ప్రదర్శించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయితీలు, పట్టణాలు, మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రాల్లో వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే రాష్ట్ర శ్రేయస్సు కోసం దేవాలయాలు, మసీదులు, చర్చ్‌లు, గురుద్వారాల్లో ప్రత్యేక ప్రార్ధనలు చేయాలని కూడా శర్మ ఆదేశించారు. ఆసరా, ఫించన్లు, దీపం కనెక్షన్ల పంపిణీ, ఎన్ఆర్ఇజిఎస్ వేతనాలు చెల్లింపు, వివిధ పథకాలకు శంకుస్ధాపనలు, ఆస్తుల పంపిణీ తదితర కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. ఇదంతా ఓ రకంగా ప్రజలను భాగస్వామ్యం చేసే కార్యక్రమంగానే చూడాలి. ప్రత్యేకించి అమరుల కుటుంబాలను దరికి చేర్చుకోవడం ద్వారా వారిలో భరోసా కల్పించడానికి సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. రానున్న మూడేళ్ల కాలంల తెలంగాణ మరింతగా అభివృద్ది చెందేందుకు ఇప్పుడు తీసుకుంటున్న లేదా చేస్తున్న కార్యక్రమాలు ఎంతగానో దోహదపడాయనడంలోనూ సందేహం లేదు.