అమరుల యాదిలో సామాజిక చైతన్య సదస్సు సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో శ్రామిక రాజ్యంకై పోరాడుదాం బుర్ర శ్రీనివాస్ గౌడ్ జిల్లా కార్యదర్శి.
ములుగు జిల్లా
గోవిందరావుపేట ఆగస్టు 14 (జనం సాక్షి):-
ఆదివారం పసర గ్రామంలోని తాటి వనంలో జరిగిన సదస్సుకు జక్కు మొగిలి గౌడ్ అధ్యక్షత వహించగా బుర్ర శ్రీనివాస్ గౌడ్ హాజరై రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగాఆగస్టు 2 నుండి 18 తారీకు వరకు గ్రామ గ్రామాన సామాజిక చైతన్య యాత్రలు చేసి సభలు సమావేశాలు నిర్వహించుకుంటున్నామని బుర్ర శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు కల్లుగీత కార్మికుల హక్కుల కోసం పోరాడిన అమరులు బొమ్మగాని ధర్మ బిక్షం బైరు మల్లయ్య బొలగాని పుల్లయ్య పెరుమాళ్ళ జగన్నాథం లాంటి నాయకుల గురించి నేటి తరానికి తెలియజేస్తామన్నారు.మొగల్ చక్రవర్తులకు వ్యతిరేకంగా పోరాడి గోల్కొండ కోటలు జయించిన సర్వాయి పాపన్న స్ఫూర్తితో పనిచేయాలన్నారు ఆర్థిక సామాజిక సమానత్వం కోసం పోరాడి శ్రామిక రాజ్యం సాధించడమే వారికి ఇచ్చే నిజమైన నివాళి అన్నారు రాష్ట్రంలో ఉన్న కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఉన్న గీత కార్మికులందరికీ వృత్తికి ఉపయోగపడే విధంగా ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని సంవత్సరంలో వృత్తి ఆరు నెలలే ఉంటున్నందున మిగతాకాలం జీవించడానికి గీతన్నబందు పేరుతో కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు.ప్రతి జిల్లాలో నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేసి గౌడ యువతీ యువకులకు ఉపాధి కల్పించాలని కోరారు మద్యపానం నిషేధం దశలవారీగా అమలు చేయాలని 50 సంవత్సరాలు పైబడిన వారికి గత నాలుగు సంవత్సరాల నుండి పెన్షన్ ఇవ్వడం లేదని వారికి వెంటనే ఇవ్వాలని అకాల వర్షాల వలన చెట్లు ఎక్కకపోవడంతో గీత కార్మికులు నష్టపోయారు వీరికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం హర్షనీయం అని అన్నారు.ఏజెన్సీ గౌడులను గీత కార్మికులుగా గుర్తించి సభ్యత్వాలు ఇవ్వాలని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు ఆగస్టు 18న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే బహుజన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372 వ జయంతిని ములుగు జిల్లా కల్లుగీత కార్మికులు అందరూ అధిక సంఖ్యలో హాజరై అన్ని వర్గాలకు చెందిన చేతి వృత్తిదారులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జక్కు రాజు గౌడ్ పూజరి సారంగంగౌడ్ పూజరి శీను గౌడ్ దొనీకాల మల్లికార్జున జక్కు రణదిప్ గౌడ్ బొమ్మగాని షణ్ముఖ గౌడ్ కర్ణాకర్ గౌడ్ జక్కు వేణుగోపాల్ గౌడ్ జక్కు హరికీర్త్ గౌడ్ మెరుగు సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.